Bridge Collapsed: ఇదేందయ్యా.. ఇది.. ప్రారంభానికి ముందే బ్రిడ్జి కూలడమేంటి? బీహార్ లో ఘటన.. వీడియోతో

వెరసి బీహార్‌లోని బెగుసరాయ్‌లో 13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓ వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది.

Credits: Twitter

Begusarai, Dec 19: గుత్తేదార్ల నాసిరకం పనులు, జాప్యం, కాంట్రాక్టు పనుల్లో అవినీతి.. వెరసి బీహార్‌లోని (Bihar) బెగుసరాయ్‌లో (Begusarai) 13 కోట్ల రూపాయలతో నిర్మించిన ఓ వంతెన ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. (Bridge collapses before inauguration) గండక్ నదిపై 206 మీటర్ల పొడవున ఈ బ్రిడ్జ్ నిర్మించారు.

తెలంగాణలో ‘హస్త’వ్యస్తం.. కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం... 12 మంది రాజీనామా.. రేవంత్ నాయకత్వానికి వ్యతిరేకంగానే..

వంతెన ముందుభాగం నిన్న నదిలో కుప్పకూలింది. ముఖ్యమంత్రి నాబార్డ్ పథకం (NABARD Scheme) కింద ఈ బ్రిడ్జ్‌ ను నిర్మించారు. అయితే, యాక్సస్ రోడ్డు లేకపోవడంతో బ్రిడ్జిని ప్రారంభించలేదు. ఇటీవల ఈ వంతెన ముందుభాగంలో పగుళ్లు కనిపించాయి. దీనిపై స్థానికులు అధికారులకు లేఖ కూడా రాశారు. వారు స్పందించడానికి ముందే అది కుప్పకూలింది.

హిందూ పంచాంగంలో వచ్చే ఏడాది 13 నెలలు.. అధికంగా వచ్చిన ‘శ్రావణం’.. 19 సంవత్సరాలకు ఒకసారి ఇలా..

2016లో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభంకాగా, 2017లో పూర్తయింది. అయితే, బ్రిడ్జిపైకి వెళ్లేందుకు యాక్సెస్ రోడ్డు లేకపోవడంతో బ్రిడ్జి ప్రారంభోత్సవానికి నోచుకోలేకపోయింది. గుత్తేదార్ల నాసిరకం పనులు, జాప్యం, కాంట్రాక్టు పనుల్లో అవినీతే బ్రిడ్జి కూలడానికి కారణంగా స్థానికులు ఆరోపిస్తున్నారు.