Revenge on Snake: రెండేండ్ల చిన్నారి పెదవిపై కాటేసిన పాము.. కోపంతో ఆ పామును ఆ చిన్నది ఏం చేసిందో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

కసితీరా కొరికి ముక్కలు చేసిన రెండేండ్ల చిన్నారి.. టర్కీలో ఘటన

Snake Girl (Photo Credits: https://www.mirror.co.uk/)

Istanbul, August 16: పాములు (Snakes) పగ (Revenge) తీర్చుకుంటాయని అంటారు. అయితే తనను కాటు (Bite) వేసిందనే కోపంతో ఓ రెండేళ్ల చిన్నారి పాముపై పగ తీర్చుకుందంటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఈ ఘటన టర్కీ(Turkey) లోని కంతార్‌ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. తన ఇంటి వెనకాల పెరటిలో సదరు చిన్నారి ఆడుకుంటోంది.

భూమి మీద నీరు ఏర్పడటానికి కారణం ఏంటో చెప్పిన జపాన్ పరిశోధకులు.. విషయం తెలిస్తే షాక్ అవుతారు..

ఇంతలో ఒక్కసారిగా పెద్దగా అరిచింది. ఆ కేకలు విని చుట్టుపక్కలవారు పరుగున వెళ్లారు. అయితే, చిన్నారి నోరు మొత్తం రక్తంతో తడిసి ఉండటంతో షాక్ కి గురయ్యారు. తీరా చూస్తే, పాప నోట్లో చిద్రమైన 20 అంగుళాల (Inches) పాము ఉంది. చిన్నారి కింది పెదవిపై పాము కాట్లు కూడా ఉన్నాయి. విషయాన్ని గ్రహించిన చుట్టుపక్కల వాళ్ళు.. వెంటనే చిన్నారిని ఆసుపత్రికి (Hospital) తరలించారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.