Earth (Image Credits: Google)

Tokyo, August 16: ఈ భూమ్మీద 30 శాతం భూభాగం ఉంటే, మిగతా 70 శాతం నీరే. అంత భారీ స్థాయిలో నీరు (Water) ఎలా వచ్చిందని గత కొన్నేండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కాగా, ఈ అంశంపై జపాన్ (Japan)పరిశోధకులు తాజాగా కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. సౌర వ్యవస్థ ఆవలి నుండి గ్రహశకలాలు(ఆస్టరాయిడ్స్‌) (Asteroids).. నీటిని భూమ్మీదకు మోసుకొచ్చాయని జపాన్‌ స్పేస్‌ మిషన్‌ వెల్లడించింది.

హైదరాబాద్ నగరం దివ్యంగా వెలుగుతోంది అంటూ నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ట్వీట్, స్పేస్ స్టేష‌న్ నుంచి భారత్ వైభ‌వాన్ని చూస్తున్న‌ట్లు వెల్లడి

వాటి ద్వారానే వందల కోట్ల సంవత్సరాల కిందట భూమ్మీద నీరు, సముద్రాలు (Sea) ఏర్పడ్డాయన్నది ఈ మిషన్‌ చెబుతోంది. 2020లో రైయుగు (Ryugu) అనే గ్రహశకలం నుంచి కొంత పదార్థాన్ని భూమి మీదకు తీసుకొచ్చిపరిశీలించారు. రైయుగు శాంపిల్స్‌ (Samples)లో కనిపించిన ఆర్గానిక్‌ మెటీరియల్‌ వల్లే భూమ్మీద నీటి జాడ ఏర్పడి ఉంటుందని, ఇలాంటి మరిన్ని ఆస్టరాయిడ్స్ భూమి మీద నీళ్ళు ఏర్పడటానికి కారణమై ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.