76వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటున్న నేప‌థ్యంలో నాసా ఆస్ట్రోనాట్ రాజాచారి ఇండియాకు విషెస్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌లో ఆయన స్పందిస్తూ భార‌త్ స్వాతంత్య దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటోంద‌ని, స్పేస్ స్టేష‌న్ నుంచి ఆ దేశ వైభ‌వాన్ని చూస్తున్న‌ట్లు ఆయ‌న త‌న ట్వీట్‌లో తెలిపారు. ఇక త‌న తండ్రికి చెందిన హైద‌రాబాద్ న‌గ‌రం దివ్యంగా వెలుగుతోన్న‌ట్లు రాజా చారి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు. భార‌త్‌, అమెరికా మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయ‌ని, అన్ని రంగాల్లోనూ స‌హ‌కారం అందుతోంద‌న్నారు. ఇస్రో చేప‌డుతున్న అన్ని మిష‌న్లు స‌క్సెస్ కావాల‌ని రాజాచారి ఆకాంక్షించారు. ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ అంత‌రిక్ష కేంద్రంలో భార‌త సంత‌తి రాజాచారి ఉన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)