CBI Raids at Sisodia House: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్.. మండిపడ్డ కేజ్రీవాల్
మండిపడ్డ కేజ్రీవాల్
New Delhi, August 19: కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై మోదీ సర్కారు ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం, సహా పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో శుక్రవారం ఉదయం సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(లిక్కర్ స్కామ్) కేసులో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు.
కేంద్రం సంచలన నిర్ణయం.. టాప్ యూట్యూబ్ ఛానల్స్ పై నిషేధం.. జాబితాలో ఏడు భారత్ కు చెందినవే..
సీబీఐ దాడులపై మనీష్ సిసోడియా స్పందిస్తూ.. దేశంలో మంచి చేసే వారిని ఇలా వేధింపులకు గురిచేయడం దురదుష్టకరమని అన్నారు. సీబీఐ సోదాల సందర్భంగా కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘సీబీఐకి స్వాగతం. మేము పూర్తి సహకారం అందిస్తాము. ఇప్పుడు కూడా మీకు ఏదీ దొరకదు’ అంటూ కామెంట్స్ చేశారు.