New Delhi, August 18: కేంద్ర ప్రభుత్వం (Central Govt.) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో టాప్ 8 యూట్యూబ్‌ ఛానళ్లను (YouTube Channels) బ్లాక్‌ చేసినట్టు గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. సదరు ఛానళ్లు దేశ భద్రత, విదేశీ వ్యవహారాలపై తప్పుడు ప్రచారం చేసినందుకు తాము ఛానళ్లను బ్లాక్‌ చేసినట్టు కేంద్రం పేర్కొంది.

వీల్‌చైర్‌లో మైక్ టైసన్.. బాక్సింగ్‌ దిగ్గజానికి ఏమైంది..?

బ్లాక్‌ చేసిన ఛానళ్లలో 7 భారత్‌కు చెందినవి కాగా, ఒక ఛానల్‌ పాకిస్తాన్‌కు చెందినది. తాజాగా బ్లాక్‌ చేసిన 8 యూట్యూబ్ ఛానల్స్‌.. దాదాపు 86 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, 114 కోట్ల మంది వ్యూస్‌తో అకౌంట్లను కలిగి ఉన్నాయి.