Video on Railway Tracks: ప్రాణాల మీదకు తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ మోజు, రైల్వే ట్రాక్‌పై రీల్స్ చేస్తుండగా ఢీకొట్టిన ట్రైన్, వైరల్‌గా మారిన వీడియో, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు (Graphic Video Warning)

ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అజయ్.. రైలు పట్టాల వద్ద ఒక వీడియో షూట్ చేయాలనుకున్నాడు. కాజీపేట (Kazipet)సమీపంలోని వడ్డేపల్లి ట్రాక్‌పై వీడియో తీస్తున్నాడు. రైలు వెనుక నుంచి వస్తుండగా, పక్కనే నడుస్తూ రావాలనుకున్నాడు.

Warangal, SEP 04: రీల్స్ మీద మోజుతో (Insta Reels) ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు చాలా మంది. రిస్కీ ప్రదేశాల్లో వీడియోలు తీసి, శభాష్ అనిపించుకోవాలని, లైక్స్, కామెంట్స్ కోసం ఆలోచిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రీల్స్ (Reels) వల్ల కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా వరంగల్ జిల్లాకు (Warangal) చెందిన అజయ్ అనే యువకుడు రీల్స్ కోసం వీడియో తీస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న అజయ్.. రైలు పట్టాల వద్ద ఒక వీడియో షూట్ చేయాలనుకున్నాడు. కాజీపేట (Kazipet)సమీపంలోని వడ్డేపల్లి ట్రాక్‌పై వీడియో తీస్తున్నాడు. రైలు వెనుక నుంచి వస్తుండగా, పక్కనే నడుస్తూ రావాలనుకున్నాడు. కానీ, వెనుక నుంచి వచ్చిన రైలు అతడ్ని వేగంగా ఢీకొట్టింది.  రైలుకు, తనకు మధ్య ఉన్న దూరం వల్ల ప్రమాదం జరగదనుకున్నాడు. కానీ, రైలుకు దగ్గరగా ఉండటంతో అది ఢీకొంది.

ఈ ఘటనలో అజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎదురుగా వీడియో చిత్రీకరిస్తున్న అతడి స్నేహితులు వెంటనే అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అజయ్ ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (MGM hospitail) చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Electric Shock: ఐస్ క్రీం కోసమని వెళ్లిన నాలుగేళ్ల పాప ఫ్రిజ్ ని తాకగానే ఉన్నట్టుండి పడిపోయింది.. ఏమైంది? 

ఇన్‌ స్టా రీల్స్ చేస్తూ గతంలో కూడా చాలామంది ప్రమాదాలకు గురయ్యారు. బహిరంగ ప్రదేశాల్లో రీల్స్ చేస్తూ గాయపడ్డవారు చాలా మంది. ఇక జలపాతాల వద్ద కూడా ఇలాంటి రీల్స్ చేస్తూ పలువురు ప్రమాదానికి గురయ్యారు. తాజాగా అజయ్‌ చేసిన ఈ పనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇన్ స్టా రీల్స్  కోసం ఇలాంటి సాహసాలు చేయొద్దంటూ సలహాలు ఇస్తున్నారు.



సంబంధిత వార్తలు