CWG 2022: హాకీలో ఫైనల్ కు దూసుకుపోయిన భారత్... థ్రిల్లింగ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలుపు..

శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 3-2 తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించిన భారత్‌ స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచింది.

Indian Hockey Team (Image Credits: Twitter)

Birmingham, August 6: భారత పురుషుల హాకీ (Hockey) జట్టు కామన్‌వెల్త్‌ గేమ్స్‌ (Commonwealth Games) 2022లో తమ జోరును ప్రదర్శిస్తోంది. శనివారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో (Semifinals) 3-2 తేడాతో గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. దీంతో భారత్‌ స్వర్ణ పతకానికి అడుగుదూరంలో నిలిచినట్లయింది.  తొలి క్వార్టర్‌లో ఇరుజట్లు గోల్‌ చేయలేకపోయాయి. అయితే రెండో క్వార్టర్‌ ఆరంభంలోనే భారత్‌ ఖాతాలో తొలి గోల్‌ నమోదైంది.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా.. ఫైనల్ లోకి దూసుకెళ్లిన హర్మన్‌ప్రీత్‌ బృందం.. ఆసీస్ తో అమీతుమీ

ఇక మూడో క్వార్టర్‌లో సౌతాఫ్రికా (South Africa) తరపున రెయాన్‌ జూలిస్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ ఆధిక్యం 2-1కి తగ్గింది. నాలుగో క్వార్టర్‌ మొదలైన రెండో నిమిషంలోనే డ్రాగ్‌ ఫ్లికర్‌ జుగ్‌రాజ్‌ గోల్‌ కొట్టడంతో భారత్‌ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక సౌతాఫ్రికా తరపున రెండో గోల్‌ నమోదు చేసింది. అయితే చివర్లో కాస్త ఉ‍త్కంఠ నెలకొన్నప్పటికి భారత్‌ ప్రత్యర్థిని గోల్స్‌ చేయకుండా అడ్డుకొని ఫైనల్లోకి ప్రవేశించింది.