Birmingham, August 6: కామన్వెల్త్ క్రీడల్లో (Commonwealth Games) భారత మహిళల క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఈ క్రీడల్లో తొలిసారిగా (FirstTime) ప్రవేశపెట్టిన మహిళల టి20 క్రికెట్‌లో ఆల్‌రౌండ్ (Allround) ప్రదర్శన కనబర్చింది. దీంతో హర్మన్‌ప్రీత్ బృందం ఫైనల్లో (Finals)కి అడుగు పెట్టింది. ఫలితంగా స్వర్ణం లేదా రజత పతకం గెలుచుకోవడం ఖాయమైంది. శనివారం ఆసక్తికరంగా జరిగిన తొలి సెమీఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుపై భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.
అనంతరం ఇంగ్లండ్ (England) 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. దీంతో భారత జట్టు ఫైనల్ కు చేరుకున్నది. ఆస్ట్రేలియా (Australia), న్యూజిలాండ్ (Newzealand) జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆసిస్ గెలుపొందింది. ఆస్ట్రేలియా జట్టుతో తుది పోరులో భారత తలపడుతుంది.