Alberto Nonino (Photo Credits: Twitter)

Columbia, August 7: ప్రపంచస్థాయి వేదికలపై క్రీడాకారులకు అప్పుడప్పుడు అనుకోని వింత పరిస్థితులు ఎదురవుతాయి. ఇదీ అలాంటిదే. కొలంబియా (Columbia)లో జరుగుతున్న వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అండర్‌-20 ఛాంపియన్‌షిప్స్‌లో ఇటలీ అథ్లెట్‌ ఆల్బెర్టో నోనినో (18)ను (Alberto Nonino) దురదృష్టం వెంటాడింది. శుక్రవారం కాలీలో జరిగిన 400 మీటర్ల డెకాథ్లన్‌ ఈవెంట్‌ మధ్యలో ఆల్బెర్టో నోనినో దుస్తుల్లో (షార్ట్స్‌ లో) సమస్య తలెత్తింది. జననాంగం (Penis) బయట పడటంతో అతని పరుగులో వేగం తగ్గింది.

విండీస్‌పై భారత్‌ ఘనవిజయం, ఆల్‌రౌండ్‌ షో తో అదరగొట్టిన టీమిండియా, ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం, అదరగొట్టిన రిషబ్, అవేష్ ఖాన్

ఆ సమస్యను చక్కదిద్దుకొనేందుకు రెండు మూడు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ప్రత్యర్థులు నోనినోను అధిగమించి ముందుకు దూసుకెళ్లిపోయారు. దీంతో మొత్తం మీద 51.57 సెకన్లలో రేస్‌ను పూర్తిచేసిన నోనినో ఆ ఈవెంట్‌లో అందరి కంటే చిట్టచివరన (Last) నిలవాల్సి వచ్చింది.