Indian 2: కమల్ హాసన్ భారతీయుడు 2కు మరో అవాంతరం.. అందుబాటులో లేని కాజల్.. కొత్త హీరోయిన్ల కోసం నిర్మాతల వేట.. ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరు ఫైనల్?
ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్ వేటలో పడిందట. కాజల్ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొనె, కత్రీనా కైఫ్ పేర్లను పరిశీలిస్తున్నారట.
Hyderabad, August 3: లోక నాయకుడు కమల్‌హాసన్ హీరోగా భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక‍్కిస్తున్న సినిమానే 'ఇండియన్ 2' (భారతీయుడు 2). అయితే, ఈ సినిమా షూటింగ్ కి ప్రతీసారి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. అప్పట్లో సెట్లో ప్రమాదం జరిగి నలుగురు ప్రాణాలు కోల్పోవడం. చిత్రంలో హాస్య పాత్ర పోషిస్తున్న వివేక్ హఠాన్మరణం, ఆ తరువాత దర్శకుడికి, లైకా ప్రొడక్షన్స్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం.. ఇలా ఎన్నో రకాలు అడ్డుంకులు వచ్చాయి. ఎట్టకేలకు ఇటీవల సమస్యలు సద్దుమనగడంతో ఇండియన్ 2 షూటింగ్ ప్రారంభించే ఆలోచనలో ఉంది చిత్ర బృందం. అయితే దీనికి ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేస్తున్న కాజల్ ఇప్పుడు అందుబాటులో లేదు. ఇటీవల ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర బృందం మళ్లీ హీరోయిన్ వేటలో పడిందట.
కాజల్ స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొనె, కత్రీనా కైఫ్ పేర్లను పరిశీలిస్తున్నారట. మరి ఎవరు హీరోయిన్ గా ఖరారు అవుతారో? షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందోనని అభిమానులు వెయ్యి కండ్లతో ఎదురు చూస్తున్నారు.