Ex-BJP MLA Papareddy: కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే పాపారెడ్డి, అతను సివిల్ డ్రెస్‌లో ఎందుకు వచ్చి మా మధ్య నిలబడ్డాడడని ప్రశ్నించిన కర్ణాటక బీజేపీ నాయకుడు
ఆయనను దూషిస్తూ చెంపదెబ్బ (Papareddy caught on cam slapping police constable) కొట్టారు.
Bengaluru, Nov 9: నిరసన ర్యాలీ సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దిష్టిబొమ్మను దహనం చేయకుండా అడ్డుకున్న పోలీసు కానిస్టేబుల్‌పై బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎ పాపారెడ్డి (Ex-BJP MLA Papareddy) తన ప్రతాపం చూపారు. ఆయనను దూషిస్తూ చెంపదెబ్బ (Papareddy caught on cam slapping police constable) కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాజీ బీజేపీ ఎమ్మెల్యే పాపారెడ్డిని అరెస్ట్ చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర న్యాయ సలహాదారుడు రామన్న డిమాండ్ చేశారు.
వైరల్ అయిన ఈ వీడియోలో, బిజెపి నాయకుడు రాయచూర్ వెస్ట్ పోలీస్ స్టేషన్‌కు అనుబంధంగా ఉన్న కానిస్టేబుల్ రాఘవేంద్రను (constable Raghavendra) చెంప మీద కొట్టడం కనిపించింది. ఆ సమయంలో కానిస్టేబుల్ పోలీసు యూనిఫాంలో లేడు. అక్టోబరు 26న సిందగిలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా నవంబర్ 3, బుధవారం బీజేపీ షెడ్యూల్డ్ కుల మోర్చా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఈ సంఘటన జరిగింది.
పాపారెడ్డి చెంపదెబ్బ కొట్టిన తరువాత వాగ్వాదం వేడెక్కడంతో పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పాపారెడ్డిని కానిస్టేబుల్‌కు దూరం చేశారు. అనంతరం విలేకరులతో పాపారెడ్డి మాట్లాడుతూ.. సివిల్ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ అని తనకు తెలియదని, అతన్ని బీజేపీ కార్యకర్తగా భావించారని అన్నారు. కానిస్టేబుల్ దిష్టిబొమ్మను లాక్కొని డ్రైన్‌లో పడేసాడని, ఇది తనపై చిరాకు తెప్పించిందని ఆరోపించారు.
Here's Viral Video
తన చర్యకు క్షమాపణలు చెబుతారా అని ప్రశ్నించగా.. ‘నేనెందుకు క్షమాపణలు చెప్పాలి.. అతడిపై (కానిస్టేబుల్) చర్యలు తీసుకోవాలి.. వినయంగా ఉండాల్సింది.. సివిల్ డ్రెస్‌లో ఎందుకు వచ్చి మా మధ్య నిలబడ్డాడు. సాధారణ పార్టీ కార్యకర్త మాదిరి దిష్టిబొమ్మను లాక్కొని పారిపోయారా?" అంటూ ప్రశ్నించారు. గత 50 సంవత్సరాలుగా ఉన్న దిష్టిబొమ్మలను దహనం చేసే సాధారణ సంప్రదాయానికి" అంతరాయం కలిగించడం వెనుక రాఘవేంద్ర ఉద్దేశ్యమేమిటని అనుమానిస్తూ పాపారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ నిఖిల్ బి మాట్లాడుతూ మాజీ శాసనసభ్యునిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన ఎస్పీ, పాపారెడ్డిపై ఇప్పటికే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసినట్లు చెప్పారు.