Ajay Banga: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేస్తున్నట్టు బైడెన్ ప్రకటన.. భారత సంతతి పౌరుల ప్రతిభను గుర్తిస్తున్న అమెరికా

ఇప్పటికే, ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు అధ్యక్షుడు బైడెన్ ప్రభుత్వంలో కీలక పదవులు పోషిస్తున్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను అమెరికా నామినేట్ చేసింది.

Credits: Twitter

Newyork, Feb 24: భారత సంతతి పౌరులకు (Indian Origin)  అమెరికాలో (America) కీలక పదవులు లభిస్తున్నాయి. ఇప్పటికే, ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలతో పాటు అధ్యక్షుడు బైడెన్ (Biden) ప్రభుత్వంలో కీలక పదవులు పోషిస్తున్న భారత సంతతి వ్యక్తుల జాబితాలో మరొకరు చేరారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అజయ్ బంగాను (Ajay Banga) అమెరికా నామినేట్ చేసింది. ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవికి అజయ్ బంగా పేరును సూచిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ప్రకటించారు. తద్వారా భారతీయుల శక్తిసామర్థ్యాలకు అమెరికా ప్రభుత్వం తగిన గుర్తింపునిస్తోంది.

టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో చతికిలపడ్డ టీమిండియా ఉమెన్స్ జట్టు, చెదిరిన ప్రపంచకప్ కల, ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా

ఎవరీ బంగా?

అజయ్ బంగా గతంలో మాస్టర్ కార్డ్ సీఈవోగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన ప్రైవేటు ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్ లో వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. వ్యాపార, ఆర్థిక రంగంలో ఆయనకు 30 ఏళ్ల విశేష అనుభవం ఉంది. మాస్టర్ కార్డ్ తో పాటు అమెరికన్ రెడ్ క్రాస్, క్రాఫ్ట్ ఫుడ్స్, డౌ ఐఎన్సీ సంస్థల్లో కీలక పదవుల్లో విధులు నిర్వహించారు.

అమెరికాలో మళ్లీ మంచు తుపాను భీభత్సం, 1500కు పైగా విమానాలు రద్దు, 2.80 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరా కట్