Fake Calls Alert: మిత్రమా.. *401# నొక్కి ఆ తర్వాత ఫోన్ నంబర్ డయల్ చేశారో ఇక అంతే.. మీ ఫోన్ ఇతరుల కంట్రోల్ లోకి.. యూజర్లకు కేంద్రం హెచ్చరిక. గుర్తు తెలియని నంబర్లతో వచ్చే మోసపూరిత కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిక
గుర్తు తెలియని నంబర్లతో వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ పౌరులను హెచ్చరించింది.
Newdelhi, Jan 12: సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం (Central Government) యూజర్లను (Users) అలర్ట్ (Alert) చేసింది. గుర్తు తెలియని నంబర్లతో వచ్చే మోసపూరిత ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ పౌరులను హెచ్చరించింది. మోసగాళ్లు టెలికం సర్వీస్ ప్రతినిధులుగా, సాంకేతిక సిబ్బందిగా పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపింది. సిమ్ కార్డు లేదా నెట్‌వర్క్ లో సమస్య ఉందని, దీని పరిష్కరిస్తామని మాయమాటలు చెప్తారని పేర్కొన్నది.
*401# నొక్కి తర్వాత నంబర్ ఎంటర్ చేస్తే..
ముఖ్యంగా *401# నొక్కి తర్వాత గుర్తు తెలియని నంబర్ చెప్పి, దానికి డయల్ చేయాలని కోరుతారని వివరించింది. అలా చేస్తే ఫోన్ లో ‘అన్ కండీషనల్ కాల్ ఫార్వర్డింగ్’ యాక్టివేట్ అవుతుందని, దీంతో ఆ గుర్తు తెలియని వ్యక్తి నియంత్రణలోకి మన ఫోన్ వెళ్లిపోతుందని తెలిపింది.
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..