Newyork, Jan 12: ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన ఎర్ర సముద్రంలో (Red Sea) వాణిజ్య నౌకలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్(Houthi Rebels) పై అమెరికా (America), బ్రిటన్ (Britain) సైన్యాలు కన్నెర్రజేశాయి. ప్రపంచ దేశాల వాణిజ్యానికి అడ్డంకులు సృష్టిస్తున్న హౌతీలపై శుక్రవారం ప్రతీకార దాడులు చేశాయి. యెమెన్ లో హౌతీల అధీనంలో ఉన్న డజనుకుపైగా స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. యుద్ధనౌక నుంచి టొమాహాక్ క్షిపణులతో పాటు యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. లాజిస్టిక్ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆయుధ భాండాగారాలు, రాడార్ వ్యవస్థలే లక్ష్యంగా దాడులు చేశామని అమెరికా అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా ఇదిగో..
US-UK coalition strike Iran-backed Houthi targets in Yemen after spate of ship attacks in Red Sea https://t.co/YDzo3egssS
— Fox News (@FoxNews) January 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)