Fire Haircut: వినూత్న హెయిర్ కట్ కోసం సెలూన్ కు వెళ్లిన కుర్రాడు.. జుట్టుకు మంటల సెగ తగిలేలా చేసిన క్షురకుడు.. ఒక్కసారిగా భగ్గుమన్న మంటలు.. కుర్రాడికి తీవ్రగాయాలు.. గుజరాత్ లో ఘటన
హెయిర్ స్టయిల్ ను తీర్చిదిద్దేందుకు జుట్టుకు మంటల సెగ తగిలేలా చేస్తారు. దీన్నే ఫైర్ హెయిర్ కట్ గా పిలుస్తారు. అయితే, ఇలా నిప్పుతో హెయిర్ కట్ చేయించుకునే ప్రయత్నంలో గుజరాత్ కు చెందిన ఓ టీనేజి కుర్రాడు ఆసుపత్రి పాలయ్యాడు.
Gandhinagar, October 28: ఇటీవల కాలంలో ఫైర్ హెయిర్ కట్ (Fire Haircut) పాప్యులర్ (Popular) అయింది. హెయిర్ స్టయిల్ ను తీర్చిదిద్దేందుకు జుట్టుకు మంటల (Flame) సెగ తగిలేలా చేస్తారు. దీన్నే ఫైర్ హెయిర్ కట్ గా పిలుస్తారు. అయితే, ఇలా నిప్పుతో హెయిర్ కట్ చేయించుకునే ప్రయత్నంలో గుజరాత్ (Gujarath) కు చెందిన ఓ టీనేజి కుర్రాడు ఆసుపత్రి పాలయ్యాడు. గుజరాత్ లోని వల్సాద్ జిల్లా వాపి పట్టణంలో 18 ఏళ్ల కుర్రాడు మోడ్రన్ హెయిర్ కట్ చేయించుకునేందుకు సెలూన్ కు వెళ్లాడు.
అక్కడ క్షురకుడితో తనకు ఫైర్ హెయిర్ కట్ చేయాలని కోరాడు. దాంతో, ఆ క్షురకుడు కుర్రాడి తలపై కొద్దిభాగంలో ఓ రసాయనం పూసి మంటల సెగ తగిలేలా చేశాడు. కానీ తలపై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వాటిని నియంత్రించడం కష్టమైంది. ఈ క్రమంలో ఆ కుర్రాడికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.