Ketki dave: భర్త చనిపోయిన రెండు రోజులకే.. వర్క్ లోకి నటి.. వృత్తిపట్ల నిబద్ధతకు ఇది తార్కాణం అంటూ నెటిజన్ల ప్రశంసలు..

ముందుగానే డేట్స్‌ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు వెల్లడి. తన జీవితంలో ఏర్పడిన దుఃఖం ఇతరులపై ప్రభావం చూపకూడదని వివరణ

Ketki (Photo Credits: Twitter)

Mumbai, August 7: కొందరు నటీనటులు వృత్తిపట్ల అచంచలమైన నిబద్ధత కనబరుస్తారు. తమవల్ల నిర్మాతలు నష్టపోకూడదని వ్యక్తిగత విషయాలు, బాధలను కూడా దిగమింగుకొని పరుల గురించి ఆలోచిస్తారు. ఈ కోవలో ముందుంటారు నటి కేత్కి దేవ్‌ (Ketki dave) . బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రసిక్‌ దేవ్‌ (Rasik Dave) కిడ్నీ ఫెయిల్యూర్‌తో వారం క్రితం కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే భర్త చనిపోయిన రెండు రోజులకే నటి కేత్కి దేవ్‌ షూటింగ్‌ (Shooting)లో పాల్గొంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కేత్కి దేవ్‌.. భర్త చనిపోయినప్పటికీ ఎటువంటి బ్రేక్‌ తీసుకోలేదని పేర్కొంది. ముందుగానే డేట్స్‌ ఇచ్చేసిన కారణంగా తన వల్ల ఎవరూ ఇబ్బంది కూడదనే ఈ విధంగా చేసినట్లు తెలిపింది. తన జీవితంలో ఏర్పడిన దుఃఖం ఇతరులపై ప్రభావం చూపకూడదని పేర్కొంది.

బింబిసార సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్, వైరల్ అవుతున్న ట్వీట్, నందమూరి అభిమానుల్లో ఆనందం..

వృత్తిపట్ల కేత్కి దేవ్‌ నిబద్ధతను నెటిజన్లు (Netizens) ప్రశంసిస్తున్నారు. మేడం మీ అంకితభావానికి సెల్యూట్ అంటూ పోస్టులు పెడుతున్నారు.



సంబంధిత వార్తలు

జేబులో నుంచి ప‌ర్సు ప‌క్క‌న పెట్టి క్రికెట్ ఆడినందుకు రూ. 6.72 ల‌క్ష‌లు గాయ‌బ్, ముంబైలో క్ష‌ణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులు మాయం చేసిన కేటుగాళ్లు

Ketki dave: భర్త చనిపోయిన రెండు రోజులకే.. వర్క్ లోకి నటి.. వృత్తిపట్ల నిబద్ధతకు ఇది తార్కాణం అంటూ నెటిజన్ల ప్రశంసలు..

Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదం, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, తాను రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని తెలిపిన భారత ప్రధాన న్యాయమూర్తి

SC Dismisses AP Govt's Petition: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి