SC Dismisses AP Govt's Petition: ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు, రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇస్తామని వెల్లడి
Supreme Court of India | (Photo Credits: IANS)

Amaravati, July 19: అమరావతి భూముల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. రాజధానిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందన్న ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం కూడా తిరస్కరించింది. కాగా అమరావతి భూముల కొనుగోలులో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరగలేదంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును జగన్ సర్కార్ సుప్రీంలో సవాల్‌ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది.

అమరావతి భూముల కొనుగోలు కేసులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరగలేదంటూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును (SC Dismisses AP Govt's Petition) సుప్రీంకోర్టు సమర్ధించింది. సుప్రీంకోర్టులో అమరావతి భూముల కొనుగోలుపై (insider trading of Amaravati lands issue) వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన అనంతరం జస్టిస్ వినీత్ సరన్, జస్టిస్ దినేష్ మహేశ్వరితో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అమరావతి భూములపై దాఖలైన పిటిషన్‌‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే (Dushyant Dave), మెహఫూజ్‌ నజ్కి వాదనలు వినిపించగా.. ప్రతివాదుల తరఫున ముగ్గురు న్యాయవాదులు తమ వాదనలు ధర్మాసనం ముందు ఉంచారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ..భూముల బదలాయింపు చట్టం ప్రకారం కొనుగోలుదారులు... భూములను ఎందుకు కొనుగోలు చేస్తున్నారో అమ్మకందారులకు చెప్పాలన్నారు. ఈ విషయంలో అమ్మకం దారులు మోసపోయారని.. కొనుగోలుదారులు ప్రభుత్వ అధికారులతో కుమ్మక్కై భూములను కొనుగోలు చేశారని దుష్యంత్ పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాపై చర్చ చేపట్టాల్సిందే, రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లిన విజయసాయిరెడ్డి, రూల్‌ 267 కింద రాజ్యసభ చైర్మన్‌కు నోటీసు ఇచ్చిన వైసీపీ ఎంపీ, పోలవరంపై చర్చ చేపట్టాలని లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన

ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం కింద అమరావతిలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ చేపట్టవచ్చని, ప్రాథమిక దశలో ఉన్న విచారణను హైకోర్టు అడ్డుకుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని, ఆ ఉత్తర్వుల్లో కొన్నిఅంశాలపై అభ్యంతరాలు ఉన్నాయని చెప్పారు. భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో అనేక లోటుపాట్లు ఉన్నాయని, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టానికి అనుగుణంగా దీనిపై విచారణ జరగాల్సి ఉందని వాదించారు.

అమరావతిలో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం అమలవుతోందని, మొత్తం వ్యవహారంలో అనేక లోపాలు ఉన్నాయని తెలుస్తున్నట్టు ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ప్రస్తుతం ఈ కేసు ప్రాథమిక విచారణ దశలోనే ఉందని స్పష్టం చేశారు. 2014 నుంచి 2019 వరకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని, 2019లో ప్రభుత్వం మారాకే ఫిర్యాదులు అందినట్టు దవే సుప్రీంకోర్టుకు తెలిపారు.

2022 జూన్‌ కల్లా రెండు కాల్వలకు లింక్ పనులు పూర్తి కావాలి, అధికారులకు సూచించిన ఏపీ సీఎం వైయస్ జగన్, పోలవరం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఏపీ ముఖ్యమంత్రి

ప్రభుత్వ వాదనలతో ప్రతివాద న్యాయవాదులు విభేదించారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని న్యాయవాది ఖుర్షీద్‌ చెప్పారు. ఒక్కరూ విభేదించనప్పుడు విచారణ జరపాల్సిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీస్‌ చట్టం వినియోగంలోకి రాదన్నారు. 2014అక్టోబర్‌ నుంచి రాజధాని ఎక్కడో మీడియాలో వచ్చిందని, 14 గ్రామాల్లో 30వేల ఎకరాల్లో రాజధాని వస్తుందని కథనాలు వచ్చాయని తెలిపారు. రాజధానిపై 2014 డిసెంబర్‌ 30న ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారన్నారు. న్యాయ, చట్టపరమైన ఫిర్యాదులు నమోదు కాని కేసుగా నిలుస్తుందని ఖుర్షీద్‌ వాదించారు.

మరో ప్రతివాది తరఫున శ్యామ్‌దివాన్‌ వాదనలు వినిపించారు.‘‘రాజధాని భూములపై హైకోర్టు అన్నీ పరిశీలించే తీర్పు ఇచ్చింది. ఆరేళ్ల తర్వాత భూములు అమ్మినవారి తరఫున ఎవరో ఫిర్యాదు చేశారు. భూములు అమ్మినవారు ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. స్థానికులెవరూ ఫిర్యాదు చేయలేదని హైకోర్టు ఉత్తర్వుతో తెలుస్తోంది. ఈ కేసులో ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ చట్టం సెక్షన్‌ -55 వర్తించదు. రాజధాని ఏర్పాటు అంతా బహిరంగంగా జరిగిందని వాదించారు. ఈ వాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించకపోగా, సర్కారు పిటిషన్ ను కొట్టివేస్తున్నట్టు తెలిపింది. దీనిపై లిఖితపూర్వక ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది.