Beware of fake OTP delivery scam Representational Image (Photo Credit: PTI)

Mumbai, April 03: పర్సు పక్కన పెట్టిన క్రికెట్‌ ఆడిన వ్యక్తి రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్న సంఘటన ముంబైలో (Mumbai) చోటుచేకుంది. దక్షిణ ముంబైలోని క్రాస్ మైదాన్‌లో క్రికెట్ (Cricket) ఆడేందుకు వచ్చిన 28 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ తన క్రెడిట్, డెబిట్ కార్డులు దొంగతనానికి గురై రూ. 6.72 లక్షలు పోగొట్టుకున్నారని పోలీసులు తెలిపారు. మార్చి 30 న జరిగిన ఈ సంఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు ఆజాద్ మైదాన్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఒక అధికారి చెప్పారు.

HC on Gang Rape: మహిళపై సామూహిక అత్యాచారం కేసు, నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన ఢిల్లీ హైకోర్టు, పోలీసుల నాసిరకం దర్యాప్తుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం 

ముంబై క్రాస్ మైదాన్‌లో క్రికెట్ ఆడేందుకు (Cricket Ground) వచ్చిన బాధితుడు వివేక్ దవే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు ఉన్న వ్యాలెట్‌, మొబైల్‌ ఫోన్‌ సహా ఇతర వస్తువులను పక్కన పెట్టి ఆటలో నిమగ్నమయ్యాడు. ఆట ముగించుకుని బోరివలికి రైలులో ఇంటికి వెళుతుండగా తన మొబైల్ ఫోన్‌లో బ్యాంక్ లావాదేవీ సందేశాలను గమనించాడు. వాటి ప్రకారం అతని బ్యాంక్ ఖాతా నుండి సుమారు లక్ష రూపాయలు కట్‌ అయ్యింది. దుండగులు అతని క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి రూ. 5 లక్షలకు పైగా కొనుగోళ్లు చేసినట్లు పోలీసు అధికారి పేర్కొన్నారు.

Aurangabad Fire Accident: విషాదం! మ‌హారాష్ట్రలో ఘోర అగ్ని ప్ర‌మాదం, ఒకే కుటుంబానికి చెందిన 7 గురు మృతి, టైల‌రింగ్ షాపులో మంట‌ల చెల‌రేగి ఊపిరాడ‌క కుటుంబ‌మంతా మృతి 

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం, బాధితుడు మూడు గంటల పాటు క్రికెట్ ఆడుతుండగా, గుర్తు తెలియని నిందితులు అతని క్రెడిట్, డెబిట్ కార్డులను దొంగిలించారు, ఏటీఎం నుండి రూ. 1 లక్ష నగదును విత్‌డ్రా చేశారు. నాలుగు నగల దుకాణాల్లో షాపింగ్‌ చేశారు. దీంతో బాధితుడు ఆ నగల దుకాణాలను సంప్రదించగా వారు సీసీ ఫుటీజ్‌ అందించారు. నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.