Free Tomato Offer: విచిత్ర ఆఫర్.. స్మార్ట్ ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఉచితం.. మధ్యప్రదేశ్ లో సెల్ ఫోన్ షాపు యజమాని ప్రకటన
ఇదీ అలాంటి ఘటనే.
Hyderabad, July 9: దేశవ్యాప్తంగా పెరిగిన టమాటా రేట్లను (Tomato Rates) తమకు అనుకూలంగా వాడుకుంటూ సేల్స్ (Sales) పెంచుకునే ఆలోచన చేస్తున్నారు వ్యాపారాలు. ఇదీ అలాంటి ఘటనే. ఒక స్మార్ట్ ఫోన్ (Smart Phone) తో రెండు కిలోల టమాటాలు ఉచితమంటూ ప్రత్యేక ఆఫర్ (Special Offer) ప్రకటించి జనం దృష్టిని ఆకర్షించాడు ఓ సెల్‌ఫోన్ షాపు యజమాని. మధ్యప్రదేశ్ లోని అశోక్‌నగర్ కు చెందిన అశోక్ అగర్వాల్ ఈ ఆఫర్ ప్రకటించారు. తన ప్రకటనకు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు అశోక్ తెలిపాడు. వ్యాపారం కూడా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు.
యూపీలో కూడా..
ఇటీవల యూపీకి చెందిన ఓ సెల్ ఫోన్ షాప్ యజమాని కూడా మొబైల్ కొంటే కిలో టమాటా ఫ్రీగా ఇస్తానని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించాడు.