Medaram Submerged: మునిగిన మేడారం సమ్మక్క సారలమ్మ ఆలయం.. రెండు నుంచి మూడు అడుగుల మేర చేరిన నీరు.. ఏడుపాయలు, వరంగల్ భద్రకాళి, యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ రాజన్న ఆలయంలోనూ వరద కష్టాలు
ములుగు జిల్లా మేడారంలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది.
Hyderabad, July 28: తెలంగాణలో (Telangana) కురుస్తున్న భారీ వర్షాలకు (Heavy Rains) పలు జిల్లాలు అతలకుతం అయ్యాయి. ములుగు జిల్లా (Mulugu) మేడారంలో (Medaram) దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మక్క-సారలమ్మ ఆలయం సహా అనేక చోట్ల రెండు నుంచి మూడు అడుగుల మేర నీరు చేరింది. దీంతో గుడిసెలలో ఉండే ఆదివాసీలు నిరాశ్రయులై సాయం కోసం ఎదురు చూస్తున్నారు. జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గ్రామమంతా నీట మునగగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
మిగతా ఆలయాల్లోనూ
అటు మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వనదుర్గ అమ్మవారి ఆలయంలోకి వరద చేరింది. దీంతో దర్శనాలు నిలిపేశారు. వరంగల్ భద్రకాళి, భద్రాద్రి, యాదాద్రి, వేములవాడ రాజన్న ఆలయంలోనూ వరద కష్టాలు మొదలయ్యాయి.