Train Stunts: రైలు పట్టుకొని ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన యువకుడు.. వీడియోలు వైరల్.. అది చూసి అతన్ని హెచ్చరిద్దామని ఇంటికి వెళ్లిన పోలీసులకు షాక్.. అసలేం జరిగింది?

ముంబైలోని సెవ్రి రైల్వే స్టేషన్‌ లో నడుస్తున్న రైలుకు వేలాడుతూ ఫర్హాత్ అజామ్ షేక్ అనే యువకుడు ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు.

Train Stunts

Mumbai, July 28: ముంబైలోని (Mumbai) సెవ్రి రైల్వే స్టేషన్‌ లో నడుస్తున్న రైలుకు వేలాడుతూ ఫర్హాత్ అజామ్ షేక్ ( Farhat Azam Shaikh )  అనే యువకుడు ప్రమాదకరమైన స్టంట్స్ చేశాడు. అతడి స్టంట్స్ కి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన పోలీసులు అతడికి ఎలాగైనా హెచ్చరికలు చేద్దామని యువకుడి ఇంటికి వెళ్లాడు. అయితే, ఒక కాలు, చెయ్యి పోగొట్టుకొని ఫర్హాత్ దీనంగా ఉండటంతో పోలీసులు షాక్ కి గురయ్యారు.

తెలంగాణ కొత్త గవర్నర్‌ గా జిష్ణుదేవ్‌ వర్మ.. తొమ్మిది రాష్ర్టాలకు కొత్త గవర్నర్లు.. మహారాష్ట్ర గవర్నర్‌ గా నియమితులైన సీపీ రాధాకృష్ణన్‌

షాక్ అయ్యి.. అరెస్ట్ వద్దని

గత ఏప్రిల్ 14న మసీద్ వద్ద సదరు యువకుడు మరో స్టంట్ చేసేటప్పుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఈ ప్రమాదంలో అతని ఎడమ చేయి, కాలు కోల్పోయాడు. అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి అతన్ని అరెస్ట్ చేయలేకపోయామని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్( Railway Protection Force ) అధికారి తెలిపారు. గాయపడిన ఫర్హాత్ ఒక వీడియో రిలీజ్ చేశాడు.ఎవరూ కూడా తన లాగా స్టంట్స్‌ చేయవద్దని అభ్యర్థించాడు.

ఉద‌యం 10 గంట‌ల నుంచి రాత్రి 9.15 వ‌ర‌కు కొన‌సాగిన తెలంగాణ అసెంబ్లీ, అంశాల వారీగా అధికార ప‌క్షానికి హ‌రీష్ ప్ర‌శ్న‌ల వ‌ర్షం