Fact check: లాక్‌డౌన్ వార్తలను నమ్మకండి, మే 3వ తేదీ నుంచి మే 20 వరకు దేశంలో పూర్తి లాక్‌డౌన్‌ అనే వార్త ఫేక్, స్పష్టత నిచ్చిన పీఐబీ, క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్రం ఆదేశాలు

దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఆ ప్రచారం ఫేక్ అని చెప్పింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి స్పష్టతనిచ్చింది.

PIB Fact Check Tweet (Photo Credits: Twitter)

New Delhi, May 1: భారత దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. కొన్ని రోజులుగా రోజూ రికార్డు స్థాయిలో లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మే నెలలో కరోనా విలయం మరింత తీవ్రంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

దీంతో కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, మే 3 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ (Nationwide Lockdown to Be Imposed in India) విధిస్తుందని గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై తాజాగా కేంద్రం స్పందించింది. ఆ ప్రచారం ఫేక్ అని చెప్పింది. ఈ మేరకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) ఫ్యాక్ట్‌ చెక్‌ చేసి స్పష్టతనిచ్చింది.

దేశంలో మే 3వ తేదీ నుంచి 20వ తేదీ వ‌ర‌కు లాక్‌డౌన్ ( From May 3-20, 2021 Amid COVID-19 Surge) విధిస్తార‌ని ఓ వార్తా చానెల్ ప్ర‌సారం చేసిన‌ట్లు, ఆ క్లిప్పులు (PM Narendra Modi's Image is Fake) సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. దీనిపై స‌ద‌రు చానెల్ స్పందిస్తూ తాము అలాంటి వార్త‌లు ప్ర‌సారం చేయ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఇది జాతీయ సంక్షోభం, ప్రజల గొంతు నొక్కవద్దు, కేంద్రంతో పాటు రాష్ట్రాల డీజీపీలకు హెచ్చరికలు జారీ చేసిన సుప్రీంకోర్టు, వ్యాక్సిన్ ఉచితంగా ఎందుకివ్వరంటూ కేంద్రానికి ప్రశ్నలు సంధించిన అత్యున్న న్యాయస్థానం

లాక్‌డౌన్ వార్త‌లు అవాస్త‌వం.. లాక్‌డౌన్ విధిస్తార‌ని కేంద్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌లేద‌ని పీఐబీ స్ప‌ష్టం చేస్తూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ అవ‌స‌రం లేద‌ని, క‌రోనా కేసులు అధికంగా ఉన్న ఏరియాల‌ను కంటైన్‌మెంట్ జోన్లుగా ప‌రిగ‌ణించాల‌ని, మే 31 వ‌ర‌కు క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేయాల‌ని రాష్ట్రాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు ఇటీవ‌లే కేంద్ర హోంశాఖ సూచించింది.

PIB Fact Check Tweet:

కాగా దేశంలో కరోనా పెరుగుదల నేపథ్యంలో ఏప్రిల్ 20న ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. లాక్‌డౌన్‌ చివరి అంశం కావాలని అన్నారు. ఆ తర్వాత నుంచి సోషల్‌ మీడియాలో దీనిపై ప్రచారం మొదలైంది. లాక్‌డౌన్‌ అవసరం ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది.

కేసులు తగ్గాలంటే లాక్‌డౌన్ ఒక్కటే మార్గం, కొన్ని వారాల పాటు షట్‌డౌన్‌ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చిన డాక్ట‌ర్ అంథోనీ ఎస్ ఫౌచీ, ఇప్పటివరకు రాష్ట్రాలకు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇచ్చామని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ

ఇదిలా ఉంటే దేశంలో రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇన్ని అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. అదీ భారత్‌లోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అటు వరుసగా నాలుగో రోజు 3వేల మందికి పైనే కరోనాతో మృత్యువాతపడ్డారు.

PIB Fact Check Handle Tweeted:

24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 19,45,299 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 4,01,993 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.91కోట్లకు చేరింది. ఇదే సమయంలో మరో 3వేల 523 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు 2,11,853 మందిని కొవిడ్‌ బలితీసుకుంది. మరణాల రేటు 1.11శాతంగా ఉంది. అయితే కొత్త కేసులతో పాటు రికవరీలు కూడా ఎక్కువగానే ఉంటుండం కాస్త సానుకూల పరిణామం. గడిచిన 24 గంటల్లో దాదాపు 3లక్షల(2,99,988) మంది కరోనాను జయించారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1.56కోట్లకు చేరగా.. రికవరీ రేటు 81.84శాతంగా ఉంది.

భారత్‌లో తొలిసారిగా ఒక్కరోజే 4 లక్షలు దాటిన కేసులు, 3,523 మంది మృతి, 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వాయిదా, కరోనా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరతను ఎదుర్కుంటున్న పలు రాష్ట్రాలు

ఇక కొత్త కేసులు భారీగా పెరుగుతుండటంతో యాక్టివ్ కేసులు 32లక్షలు దాటాయి. ప్రస్తుతం 32,68,710 మంది వైరస్‌కు చికిత్స తీసుకుంటుండగా.. క్రియాశీల రేటు 17.06 శాతానికి పెరిగింది. దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. శుక్రవారం మరో 27లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వగా.. ఇప్పటివరకు 15.49కోట్ల మంది టీకా పొందారు.