Anthony Fauci (Photo Credits: Getty Images)

New Delhi, May 1: భార‌త్‌లో క‌రోనావైరస్ వ్యాప్తి కల్లోలం రేపుతోంది. గ‌డ‌చిన వారం రోజులుగా ప్ర‌తీరోజూ మూడు ల‌క్ష‌ల‌కుపైగా క‌రోనా కేసులు (Coronavirus Transmission) న‌మోద‌వుతున్నాయి. ఈ రోజు ఒక్కసారిగా ఆ సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ఈ నేప‌ధ్యంలో అంతర్జాతీయంగా క‌రోనా వైర‌స్‌పై అధ్య‌య‌నం చేస్తున్న డాక్ట‌ర్ అంథోనీ ఎస్ ఫౌచీ భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డికి లాక్ డౌన్ (Lockdown in India) ఒక్కటే మార్గమని తెలిపారు. క‌రోనా వ్యాప్తి నివార‌ణ‌కు దేశంలో కొన్ని వారాల పాటు ష‌ట్డౌన్‌ చేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు.

దీంతో పాటుగా టీకాలు వేసే కార్య‌క్ర‌మాన్ని వేగవంతం చేయాల‌న్నారు. కాగా డాక్ట‌ర్ ఫౌచీ (US Epidemiologist Anthony Fauci) అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌కు వైద్య స‌ల‌హాదారునిగా ప‌నిచేస్తున్నారు. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ భార‌త్‌లో క‌రోనా అడ్డుక‌ట్ట‌కు మూడు మార్గాలున్నాయ‌న్నారు. వాటిని తాత్కాలికం, మ‌ధ్య‌స్థం, దీర్ఘ‌కాలిక ప‌రిష్కారాలుగా పేర్కొన్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు టీకాలు వేయ‌డం త‌ప్ప‌నిస‌రి అని అన్నారు. ఆక్సిజ‌న్ కొర‌త తీరాలంటే వెంట‌నే యుద్ద‌ప్రాతిప‌దిక‌న ఆక్సిజ‌న్ ప్లాంట్ల‌ను నిర్మించి, ఉత్ప‌త్తిని పెంచాల‌న్నారు.

ఇది జాతీయ సంక్షోభం, ప్రజల గొంతు నొక్కవద్దు, కేంద్రంతో పాటు రాష్ట్రాల డీజీపీలకు హెచ్చరికలు జారీ చేసిన సుప్రీంకోర్టు, వ్యాక్సిన్ ఉచితంగా ఎందుకివ్వరంటూ కేంద్రానికి ప్రశ్నలు సంధించిన అత్యున్న న్యాయస్థానం

ఆక్సిజ‌న్, ఔష‌ధాలు మొద‌లైన‌వాటి కోసం ఇత‌ర దేశాల స‌హాయం తీసుకోవాల‌న్నారు. అలాగే వీలైనంత త్వ‌ర‌గా మరిన్ని త‌త్కాలిక ఆసుప‌త్రుల‌ను ఏర్పాటు చేయాల‌ని, ఈ విష‌యంలో అమెరికా అనుస‌రించిన విధానాల‌ను అమ‌లు చేయాల‌ని స‌ల‌హా ఇచ్చారు. భార‌త్‌లో క‌రోనా క‌ట్ట‌డికి ఏకంగా 6 నెల‌ల పాటు లాక్ డౌన్ వేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, రెండు మూడు వారాలు ష‌ట్డౌన్‌ చేసి, ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకురావ‌చ్చ‌న్నారు.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇచ్చామని, రాబోయే మూడు రోజుల్లో మరో 17 లక్షల డోసులు అందుకోనున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారంనాడు తెలిపింది. మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ దేశంలో ప్రారంభమైందని, ఈ దశలో దేశ యువత వ్యాక్సినేషన్‌ వేయించుకునేందుకు అర్హులని, తమ తమ జనాభాకు వ్యాక్సినేషన్ అందించేందుకు రాష్ట్రాల్లో 79 లక్షల వ్యాక్సిన్ డోస్‌లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయని వివరించింది.

భారత్‌లో తొలిసారిగా ఒక్కరోజే 4 లక్షలు దాటిన కేసులు, 3,523 మంది మృతి, 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్ వాయిదా, కరోనా వ్యాక్సిన్‌కు తీవ్ర కొరతను ఎదుర్కుంటున్న పలు రాష్ట్రాలు

రాష్ట్రాలు, యూటీలకు ఇచ్చిన మొత్తం 16.37 కోట్ల ఉచిత వ్యాక్సిన్ డోసులలో వృథా అయిన (వేస్టేజీ) వాటితో కలుపుకొని 15,58,48,782 డోసులు వినియోగమైనట్టు తెలిపింది. గరిష్ట సంఖ్యంలో వ్యాక్సిన్లు అందుకున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. లక్షద్వీప్‌లో వ్యాక్సిన్ వేస్టేజీ 9.76 శాతంగా ఉండగా, తమిళనాడులో 8.83 శాతం, అసోంలో 7.70 శాతం, మణిపూర్‌లో 7.44 శాతం, హర్యానాలో 5.72 శాతం ఉంది.