PV Sindhu Couple At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నవ దంపతులు పీవీ సింధు, వెంకట దత్త సాయి (వీడియో)

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు వెంకట దత్తసాయి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

PV Sindhu Couple At Tirumala (Credits: X)

Tirumala, Dec 27: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు (PV Sindhu), వెంకట దత్తసాయి దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతకుముందు తిరుపతిలోని తిరుచానూరు (Tiruchanur) శ్రీ పద్మావతి అమ్మవారిని కూడా దర్శించుకున్నారు. ఇటీవలే సింధు వివాహం హైదరాబాద్‌ కు చెందిన వెంకట దత్త సాయితో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత కొత్త దంపతులు శ్రీవారి, అమ్మవారి ఆశీస్సుల కోసం తిరుపతి వచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి సింధు-దత్త సాయి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు. శ్రీవారిని,  అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని.. పెళ్లి తర్వాత దేవుడి ఆశీస్సుల కోసం వచ్చినట్లు సింధు తెలిపారు.

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

Here's Video:

దీవిలో వివాహం

కాగా, పీవీ సింధు – వెంకట దత్తసాయి వివాహం ఈనెల 22న ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌ ఉదయ్‌ పూర్‌ లోని ఓ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించిన ఒక దీవిలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట ఒక్కటైంది. ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలను కూడా సింధు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది.

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు



సంబంధిత వార్తలు

PV Sindhu Couple At Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నవ దంపతులు పీవీ సింధు, వెంకట దత్త సాయి (వీడియో)

PV Sindhu Marriage: అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఉద‌య్‌ పూర్‌ లో జ‌రిగిన వేడుక‌కు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే హాజ‌రు.. రేపు హైద‌రాబాద్‌ లో గ్రాండ్ గా రిసెప్ష‌న్

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

TTD Action On Srinivas Goud: శ్రీనివాస్ గౌడ్‌పై చర్యలకు సిద్ధమైన టీటీడీ, దర్శనాలు- గదుల కేటాయింపులో తెలంగాణ భక్తులను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్