Tomato Price Drop: సామాన్యులకు గుడ్ న్యూస్.. రూ.60కి దిగొచ్చిన టమాటా ధర... కిలో రూ.30కే లభించే తరుణం రాబోతుంది!!
దేశంలో ఇప్పటికే చాలా చోట్ల కిలో రూ.60-రూ.80 చొప్పున టమాటా కొనుగోలు చేస్తున్న ప్రజలకు మరింత ఉపశమనం లభించనుంది.
Hyderabad, Aug 18: నిత్యావసరాల ధరల మంటతో కుదేలైన సామాన్యులకు శుభవార్త (Goodnews). దేశంలో ఇప్పటికే చాలా చోట్ల కిలో రూ.60-రూ.80 చొప్పున టమాటా (Tomato) కొనుగోలు చేస్తున్న ప్రజలకు మరింత ఉపశమనం లభించనుంది. మధ్యప్రదేశ్ (Madhyapradesh), ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh), ఉత్తరప్రదేశ్, హర్యానాలో సెప్టెంబర్ ప్రారంభంలో కొత్త పంట రావడంతో ప్రస్తుత ధరలలో భారీ తగ్గుదల ఉంటుందని భావిస్తున్నారు. నేషనల్ కమోడిటీస్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ లిమిటెడ్ (ఎన్‌సిఎంఎల్) మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ సంజయ్ గుప్తా ప్రకారం.. ఈ నెలాఖరు నాటికి టమాటా సరఫరా పెరుగుతుంది కాబట్టి, సెప్టెంబర్ మధ్య నాటికి ధరలు గణనీయంగా తగ్గి కిలో రూ. 30కి చేరుకుంటాయని ఆయన భావిస్తున్నారు.