Operation Dost: సిరియాలో భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ రెపరెపలు.. వీడియో వైరల్.. మీరూ చూడండి!
ఎటు చూసినా శిథిలాలు.. శవాల గుట్టలే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే 24వేల మందికి పైగా మృతి చెందారు. భూకంప విలయంతో అల్లాడుతున్న టర్కీతో పాటు సిరియాకు కూడా సాయం అందించేందుకు భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది.
Newdelhi, Feb 12: టర్కీ (Turkey), సిరియాలో (Syria) మృత్యు విలయం కొనసాగుతోంది.. ఎటు చూసినా శిథిలాలు.. శవాల గుట్టలే కనిపిస్తున్నాయి.. ఇప్పటికే 24వేల మందికి పైగా మృతి చెందారు. భూకంప విలయంతో అల్లాడుతున్న టర్కీతో పాటు సిరియాకు కూడా సాయం అందించేందుకు భారత్ (India) ‘ఆపరేషన్ దోస్త్’ (Operation Dost) ప్రారంభించింది. భారత్ నుంచి రెండు వాయుసేన విమానాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ట్రైనింగ్ పొందిన డాగ్ స్క్వాడ్ టర్కీకి తరలివెళ్లాయి. ప్రస్తుతం ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
సిరియాలోని హతాయ్ లో ఉన్న ఓ స్కూల్ కి చేరుకొన్న ఇండియన్ ఆర్మీ అక్కడ ఆశ్రయం పొందిన భూకంప బాధితులకు సహాయం అందించింది. ఈ క్రమంలో ఆ భవనం మీద జాతీయ పతాకం కింద ‘ఆపరేషన్ దోస్త్’ అని రాసి ఉన్నలైన్ తో కూడిన పోస్టర్ ను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.