Stolen Plane: విమానం చోరీ చేసి వాల్ మార్ట్ కూల్చేస్తానని పైలట్‌ బెదిరింపులు.. నగరం మీద విమానం గింగిరాలు.. స్థానికులను ఖాళీ చేయించిన అధికారులు.. అమెరికాలో హైడ్రామా

ఓ మినీ విమానాన్ని చోరీ (Theft) చేసిన పైలట్‌.. నగరంపై చక్కుర్లు కొడుతూ హల్‌చల్‌ సృష్టించాడు. రద్దీ ప్రాంతంలోని వాల్ మార్ట్ (WallMart) స్టోర్ మీద విమానాన్ని కూల్చేస్తానని బెదిరింపు సందేశం పంపించాడు. దీంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

Newyork, September 4: అమెరికాలో (America) థ్రిల్లర్ (Thriller) సినిమాను తలపించే ఘటన చోటుచేసుకుంది. ఓ మినీ విమానాన్ని చోరీ (Theft) చేసిన పైలట్‌.. నగరంపై చక‍్కర్లు కొడుతూ హల్‌చల్‌ సృష్టించాడు. రద్దీ ప్రాంతంలోని వాల్ మార్ట్ (WallMart) స్టోర్ మీద విమానాన్ని కూల్చేస్తానని బెదిరింపు సందేశం పంపించాడు. దీంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. స్థానికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ సంఘటన అమెరికాలోని మిస్సిసీపీ రాష్ట్రం ఈశాన్య నగరం ‘టుపెలో’లో జరిగింది.

మబ్బుల మధ్య చేపలా.. నీలి సముద్రంలో మీనాలా? ఎంత అద్భుతం

దుండగుడు నగరంలోని వాల్‌మార్ట్‌ స్టోర్స్‌ పై కూల్చేస్తాని హెచ్చరించాడని, దాంతో స్టోర్స్‌ ను ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు విమానాన్ని పైలెట్ ల్యాండ్ (Landing) చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.