Sudarshan Setu: దేశంలో అతిపెద్ద కేబుల్ బ్రిడ్జి ‘సుదర్శన్ సేతు’ను ప్రారంభించిన ప్రధాని మోదీ.. బెయిట్ ద్వీపాన్ని ఓఖ్రా పోర్టుతో కలుపుతూ రూ.979 కోట్లతో వంతెన నిర్మాణం.. మధ్యాహ్నం దేశవ్యాప్తంగా ఐదు ఎయిమ్స్ దవాఖానలను ప్రారంభించనున్న ప్రధాని (వీడియో)

గుజరాత్‌ లోని ద్వారకలో నిర్మించిన ఈ బ్రిడ్జికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

Sudarshan Setu (Credits: X)

Dwaraka, Feb 25: దేశంలోనే అతిపెద్ద కేబుల్ వంతెనగా పేరుగాంచిన సుదర్శన్ సేతు(Sudarshan Setu)ను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కాసేపటి క్రితం ప్రారంభించారు. గుజరాత్‌ లోని (Gujarat) ద్వారకలో (Dwaraka) నిర్మించిన ఈ బ్రిడ్జికి 2017లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. బెయిట్ ద్వీపాన్ని ఓఖ్రా పోర్టుతో కలుపుతూ ఈ వంతెనను రూ.979 కోట్లతో నిర్మించారు. నాలుగు లేన్లు ఉన్న ఈ బ్రిడ్జి పొడవు 2.3 కిలోమీటర్లు, వెడల్పు 27.20 మీటర్లు.

PM Vizag Tour Cancelled: ప్రధాని మోదీ వైజాగ్ పర్యటన రద్దు?? ఏయూ మైదానంలో ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపేసిన అధికారులు

Petrol-Diesel Price Cut: చమురు కంపెనీలు లాభాల్లోకి వస్తున్నాయి..పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం.. కేంద్ర పెట్రోలియం హర్‌దీప్‌ సింగ్‌ పూరీ ప్రకటన

ఎయిమ్స్ దవాఖానల ప్రారంభం కూడా

ప్రధాని మోదీ నేడు పలు ప్రారంభోత్సవాల్లోనూ పాల్గొననున్నారు. మధ్యాహ్నం రాజ్‌ కోట్‌ లోని (గుజరాత్) తొలి ఎయిమ్స్ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. ఆ తరువాత ఏపీ, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ లోని ఎయిమ్స్ ఆసుపత్రులను కూడా వర్చువల్‌ గా ప్రారంభిస్తారు. ఈ ఐదు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను మొత్తం రూ.6,300 కోట్లతో ప్రభుత్వం నిర్మించారు.

 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif