
Visakhapatnam, Feb 25: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విశాఖ (Visakhapatnam) పర్యటన రద్దయినట్టు సమాచారం. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నవీకరణ ప్రాజెక్టు మార్చి 1న ప్రారంభించేందుకు పీఎం (PM) షెడ్యుల్ ఖరారైంది. ఈ మేరకు ప్రధాని బహిరంగ సభ కోసం ఏయూ మైదానంలో అధికారులు ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అయితే, తాజాగా ప్రధాని పర్యటన రద్దయినట్టు ఢిల్లీ నుంచి సమాచారం అందినట్టు తెలుస్తోంది. దీంతో, అధికారులు ఏర్పాట్లను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, పర్యటన రద్దుపై అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
