Drunken Driver Drives Bus In Reverse Gear: మద్యం మత్తులో బస్సును రివర్స్ గేర్ లో నడిపిన డ్రైవర్.. వీడియో వైరల్
దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు.
Pune, Oct 23: మద్యం సేవించి మత్తులో ఉన్న డ్రైవర్ (Driver) బస్సును (Bus) రివర్స్ గేర్ లో వెనక్కి నడిపాడు. (Drunk Driver Drives Bus In Reverse Gear) దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ ఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం పూణేలోని విఠల్ బాబా చౌక్ ప్రాంతంలో పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (పీఎంటీ)కు చెందిన ప్రభుత్వ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని రివర్స్ గేర్ లో డ్రేవ్ చేశాడు. దీంతో ఆ బస్సు వేగంగా వెనక్కి వెళ్లడంతో వెనుక ఉన్న పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ బస్సులో ఉన్న సుమారు 50 మంది ప్రయాణికులు రక్షించాలంటూ హాహాకారాలు చేశారు.
Uri Attack: ఉరి సెక్టార్ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. ఇద్దరు ముష్కరులను కాల్చిపడేసిన సైన్యం!
జనం షాక్
ఆ సమయంలో రోడ్డుపై ఉన్న జనం కూడా ఇది చూసి షాకయ్యారు. బస్సును ఆపాలంటూ కేకలు వేశారు. ఒక వ్యక్తి బస్సు అద్దాలు పగులగొట్టి డ్రైవర్ వద్దకు వెళ్లి బస్సును ఆపేందుకు ప్రయత్నించాడు. మద్యం సేవించిన బస్సు డ్రైవర్ ను నీలేష్ సావంత్‌గా గుర్తించారు. కాగా, వెనకున్న ఓ కారు డ్రైవర్ తో బస్సు డ్రైవర్ కు వాగ్వాదం జరిగిందని, అందుకే, డ్రైవర్ బస్సును వెనక్కి తీసుకెళ్లాడని మరికొందరు చెప్తున్నారు.