Newdelhi, Oct 23: ఉత్తర కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్ (Uri Sector) లో ఉగ్రవాదుల (Terrorists) చొరబాటు ప్రయత్నాలను భారత భద్రతా దళాలు భగ్నం చేశాయి. పాక్ (Pakistan) కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. కాల్పులు తర్వాత సంఘటనా స్థలంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సంఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో మరో ఇద్దరు ఉగ్రవాదులు గాయపడ్డట్లు సమాచారం. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఆపరేషన్ ను నిలిపివేశారు. రక్షణశాఖ అధికార ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. నియంత్రణ రేఖ మీదుగా భారీగా ఆయుధాలతో ఉగ్రవాదుల బృందం చొరబాటుకు ప్రయత్నిస్తున్నట్లుగా భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో దళాలు యాంటీ ఇన్ ఫిల్ట్రేషన్ గ్రిడ్ ను పటిష్టం చేశారు. ఎడతెరిపి లేని వర్షం, తక్కువ దృశ్యమానత ఉండడంతో సాయుధ ఉగ్రవాదులు నియంత్రణ రేఖగుండా చొరబాటుకు ప్రయత్నించారు.
2 terrorists killed as troops foil infiltration bid along LoC in Uri
(Reports Ashiq Hussain)https://t.co/Zo4TmWJihw pic.twitter.com/DUSX2GymLh
— HT Punjab (@HTPunjab) October 22, 2023
రక్తంతో తడిసిపోయిన ఆయుధాలు
ఈ క్రమంలో బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని.. మిగతా ఉగ్రవాదులు వారి మృతదేహాలను తీసుకొని అక్కడి నుంచి తప్పించుకుపోయారని అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. రాత్రంతా ఆ ప్రాంతంలో నిఘా వేసి ఉంచామని పేర్కొన్నారు. మరికొందరు ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడి ఉంటారని, సంఘటనా స్థలంలో ఆయుధాలన్నీ రక్తంతో తడిసిపోయాయని పేర్కొన్నారు.