Newdelhi, Oct 23: డయాబెటిక్ (Diabetic) రోగుల్లో గాయాలు అంత సులభంగా మానవు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ‘నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్’ (ఎన్‌యూఎస్-SUS) సైంటిస్టులు సరికొత్త చికిత్సా విధానాన్ని అభివృద్ధి చేశారు. డయాబెటిక్ గాయాలను మూడు రెట్లు వేగంగా మాన్పే ‘మ్యాగ్నెటిక్ జెల్’(Diabetic Magnetic Gel)ను తయారుచేశారు. గాయమైన చోట హైడ్రోజెల్ పూతవున్న బ్యాండెజ్ వేశాక, ఒక వైర్‌లెస్ మాగ్నెటిక్ పరికరంతో దెబ్బతిన్న కణజాలాన్ని ఉత్తేజితం చేస్తామని సైంటిస్టులు తెలిపారు. దీంతో దెబ్బతిన్న కణజాలం వేగంగా కోలుకోవడానికి దోహదపడుతుందని చెప్పారు.
NUS scientists develop magnetic gel that heals diabetic wounds three times faster https://t.co/xEhWV5fGTA
— The Straits Times (@straits_times) October 22, 2023
రెండు గంటల్లోనే..
చికిత్సా సమయం ఒకటి నుంచి రెండు గంటలు ఉంటుందని, మూడు రెట్లు వేగంగా గాయం నయమవుతుందని వెల్లడించారు.