Hyderabad, Oct 23: దుర్గా మాత విగ్రహాల నిమజ్జనాల (Immersion of Durga Idols) సందర్భంగా 23వ తేదీ నుంచి 26వ తేదీ వరకు హుస్సేన్ సాగర్ (Hussian Sagar) పరిసరాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఎన్టీఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, జల విహార్ వద్దనున్న బేబీ పాండ్స్, సంజీవయ్య పార్కు వద్ద విగ్రహాల నిమజ్జనం జరుగుతుందన్నారు. దుర్గామాత విగ్రహాల తరలింపు సందర్భంగా ఉండే ట్రాఫిక్ పరిస్థితులను బట్టి ఎప్పకటిప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు.
#TrafficAdvisory #TrafficRestrictions
In view of the immersion of Durga Matha Idols @ NTR Marg, Garden point, Baby Ponds @ Jalavihar and Sanjeevaiah Park, every day the traffic diversions will be made @ the following places from 23-10-2023 to 26-10-2023..https://t.co/aNo42gKGx3 pic.twitter.com/smRsVveq5i
— Hyderabad City Police (@hydcitypolice) October 22, 2023
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- పంజాగుట్ట, రాజ్‌భవన్, ఖైరతాబాద్ ఫ్లైఓవోర్ పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద సాదన్ కాలేజీ, నిరంకారి వైపు వెళ్లాలి.
- నిరంకారి జంక్షన్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ వద్ద రవీంద్ర భారతి మళ్లిస్తారు. అయితే, కేవలం అమ్మవారి విగ్రహాలు మాత్రం ఇక్బాల్ మినార్ వైపు వెళ్లేందుకు అవకాశముంటుంది.
- కంట్రోల్ రూం, ఓల్డ్ సైఫాబాద్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు వెళ్లే వాహనాలను రవీంద్ర భారతి వద్ద లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.
- ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌పైకి తెలుగు తల్లి జంక్షన్ మీదుగా వెళ్లే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవోర్ పైకి మళ్లిస్తారు.
- అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ మార్గ్ కు వెళ్లే వాహనాలను ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
- మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్ నుంచి పీవీ మార్గ్, నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను నల్లగుట్ట బ్రిడ్జి వద్ద మళ్లిస్తారు.
- బుద్దభవన్ వైపు నుంచి నల్లగుట్ట వైపు వాహనాలను అనుమతించరు. ఈ వాహనాలను మస్జీద్ సోనబి అబ్దుల్లా వద్ద మినిస్టర్ రోడ్డు, రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
- నాంపల్లి, కంట్రోల్ రూం వైపు నుంచి బీజేఆర్ సర్కిల్ వైపు అనుమతించరు. ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద రవీంద్ర భారతి, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తారు.
Uri Attack: ఉరి సెక్టార్ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. ఇద్దరు ముష్కరులను కాల్చిపడేసిన సైన్యం!