Instagram Reels: ఇది సినిమా కాదు.. నిజజీవితం.. 18 ఏండ్ల క్రితం విడిపోయిన అక్కా తమ్ముళ్లను కలిపిన ఇన్‌స్టా రీల్.. ఎలాగో మీరూ చూడండి!
బిడ్దనో పుట్టుమచ్చ ద్వారానో, మరో గుర్తు ద్వారానో కుటుంబ సభ్యులు గుర్తుపట్టి అక్కున చేర్చుకునే సెంటిమెంటల్ దృశ్యాలు 80లో వచ్చిన చాలా సినిమాల్లో చూశాం.
Newdelhi, June 30: చిన్నప్పుడు తప్పిపోయిన కొడుకునో.. బిడ్దనో పుట్టుమచ్చ ద్వారానో, మరో గుర్తు ద్వారానో కుటుంబ సభ్యులు గుర్తుపట్టి అక్కున చేర్చుకునే సెంటిమెంటల్ దృశ్యాలు 80లో వచ్చిన చాలా సినిమాల్లో (Movies) చూశాం. ఇప్పుడు అలాంటి ఘటనే యూపీలోని (UP) కాన్పూర్ లో చోటుచేసుకుంది. అయితే, ఇది సినిమా మాత్రం కాదు. నిజజీవితమే. ఇక అసలు విషయంలోకి వెళ్తే, యూపీలోని హతిపూర్ కు చెందిన రాజ్ కుమారి చిన్నప్పుడే తన తమ్ముడికి దూరమైంది. తప్పిపోయిన తమ్ముడి కోసం.. ఆమె, కుటుంబసభ్యులు వెదుకని చోటులేదు.
తమ్ముడిని కలిసిన అక్క
18 ఏండ్ల కాలం గిర్రున తిరిగింది. తన జీవనగమనంలో పడిపోయిన రాజ్ కుమారి ఇటీవల మొబైల్ లో ఒక రీల్స్ వీడియో చూస్తున్నది. అందులోని వ్యక్తిని ఎక్కడో చూసినట్టు ఆమెకు అనిపించింది. విరిగిన అతని పన్ను చూసి 18 ఏండ్ల క్రితం ఇంట్లోంచి ముంబై వెళ్లి తప్పిపోయిన తన తమ్ముడు బాల్ గోవింద్ లా ఉన్నాడని అనుమానించింది. ఇన్ స్టాలో అతడిని సంప్రదించి చిన్నప్పడు తాను తమ్ముడితో గడిపిన విషయాలు ప్రస్తావించింది. వాటికి అతడు కూడా సరిగ్గా స్పందించడంతో అతడు తన తమ్ముడేనని నిర్ధారణ అయ్యింది. దీంతో జైపూర్ లో ఉంటున్న అతడు 18 ఏండ్ల తర్వాత అక్కను, బంధువులను కలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ప్రస్తుతం ఈ వార్తా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
టీ 20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్...బార్బడోస్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో సౌతాఫ్రికాపై విజయం...