Inhuman Act: ఎంత దారుణమైన చర్య, కోతిని ఉరితీస్తూ సంబరాలు జరుపుకున్న కొందరు గ్రామస్థులు, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అమానవీయ సంఘటన
కేరళలో గర్భవతి అయిన ఏనుగుకు పేలుడు పదార్థాలు తినిపించిన ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఓ అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మూగ జీవాలపై మానవుల క్రూరత్వానికి ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. కోతిని చెట్టుకు ఉరి వేసి చంపిన హృదయవిదారక ఘటన (Monkey hanged in Telangana) ఖమ్మం జిల్లాలోని అమ్మపాలెం (Amma Pallem) గ్రామంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు.
Hyderabad, June 29: కేరళలో గర్భవతి అయిన ఏనుగుకు పేలుడు పదార్థాలు తినిపించిన ఘటన మరువక ముందే తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఓ అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. మూగ జీవాలపై మానవుల క్రూరత్వానికి ఈ సంఘటన సజీవ సాక్ష్యంగా నిలిచింది. కోతిని చెట్టుకు ఉరి వేసి చంపిన హృదయవిదారక ఘటన (Monkey hanged in Telangana) ఖమ్మం జిల్లాలోని అమ్మపాలెం (Amma Pallem) గ్రామంలో జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ జీవిని మీరు జీవితంలో చూసి ఉండరు, కనీసం పేరు కూడా విని ఉండరు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త జీవి వీడియో
వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా (Khammam) వేంసూరు మండలం అమ్మపాలెం గ్రామంలో సాదు వేంకటేశ్వరరావు అనే అతని ఇంటి ఆవరణలో నీటి తొట్టె ఉంది. ప్రమాదవశాత్తు ఆ ఖాళీ నీటి తోట్టిలో ఓ కోతి (Monkey) పడింది. అయితే మూగ జీవిని కాపాడాల్సింది పోయి వెంకటేశ్వరరావు ఆ కోతిని కర్రతో కొట్టి చంపాడు. చంపి దానిని అక్కడే పడేయ్యటంతో వందలాదిగా కోతులు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వారు బతికి ఉన్న కోతిని చంపితే మిగతా కోతులు పారిపోతాయని చెప్పటంతో అక్కడే ఉండే మరో వ్యక్తి జోసెఫ్ రాజ్ సహయంతో మరో కోతిని పట్టుకొని దానిని కూడా ఉరి వేసి కుక్కలతో కరిపించుకుంటూ కర్రలతో కొట్టుతూ అతి దారుణంగా చంపి కుక్కలకు ఆహారంగా వేశారు. కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళితే ఆమె "అతడు" అయింది, 30 ఏళ్ల మహిళకు షాకింగ్ నిజాన్ని చెప్పిన డాక్టర్లు, ఆమె సోదరికి కూడా ఆండ్రోజెన్ ఇన్‌సెన్సిటివిటీ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్దారణ
ఈ ఘటన పై కొందరు ఫారెస్ట్ ఉన్నతాధికారి కి ఫోన్ లో సమాచారం ఇచ్చిన పెద్దగా పట్టించుకోలేదని తెలుపుతున్నారు. అతి క్రూరంగా రెండు కోతులను చంపిన వ్యక్తుల పై అటవీ జంతువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.అడవి లో ఆహారం లేక రోడ్లపైకి వస్తున్న మూగజీవాల పట్ల ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని కుదిరితే వాటికి ఆహారం అందించాలి తప్ప ఈ విధంగా కర్కశంగా ప్రవర్తించి కూడదని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే కోతి కలేబరాన్ని ఇతర కోతులు తీసుకెళ్లి ఐకమత్యాన్ని చాటాయి. ఈ విషయమై జంతు ప్రేమికులు సదరు గ్రామస్తులపై పోలీసులకు పిర్యాదు చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే హిందువులు వానరాలను హనుమంతుడితో పోలుస్తుంటారు. అలాంటిది మంచి నీళ్ల కోసం వచ్చిన మూగ జీవిని పాశవికంగా మట్టుబెట్టడం పట్ల ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)