Maharashtra Accident: మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం.. మంటలు చెలరేగి 25 మంది సజీవ దహనం.. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఘటన.. గాయపడిన 8 మంది పరిస్థితి కూడా విషమం

ఓ బస్సులో మంటలు చెలరేగి 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

Bus Fire (Credits: Twitter)

Newdelhi, July 1: మహారాష్ట్రలో (Maharastra) ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సులో మంటలు (Fire) చెలరేగి 25 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరో ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 32 మంది ప్రయాణికులతో యావత్మాల్ నుంచి పూణె (Pune) వెళ్తున్న బస్సు బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్‌ప్రెస్ వే(Buldhana-Samruddhi Mahamarg Expressway)పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

Lingamaneni Guest House Attachment: చంద్రబాబు ఇంటి జప్తుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలన్న కోర్టు, చంద్రబాబుకు కేసుతో సంబంధమేంటని టీడీపీ ప్రశ్న

ఘటన ఎప్పుడు జరిగిందంటే?

శనివారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. మంటల ధాటికి బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

CM Jagan Full Speech in Kurupam: దత్తపుత్రుడిలా నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేం, ఆ నాలుగు కోతులంటూ ప్రతిపక్షాలపై మండిపడిన సీఎం జగన్