Maharashtra: ఎమ్మెల్యేగారు.. మీరు వెంటనే నాకు లవర్‌ని వెతికిపెట్టండి, మీ ఏరియాలో అమ్మాయిల్ని ప్రేమించేలా ప్రోత్సాహించండి, మహారాష్ట్ర ఎమ్మెల్యే సుభాశ్‌ ధొతేకి లేఖ రాసిన గుర్తు తెలియని యువకుడు

నాకు లవర్ చిక్కడం లేదని మీ ఏరియాలో అమ్మాయిలని ప్రేమించేలా ప్రోత్సహించాలని ఓ గుర్తు తెలియని యువకుడు ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. ఆ లేఖ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

Image used for representational purpose only (Photo Credits: PTI)

Mumbai, Sep 15: మహారాష్ట్రలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. నాకు లవర్ చిక్కడం లేదని మీ ఏరియాలో అమ్మాయిలని ప్రేమించేలా ప్రోత్సహించాలని ఓ గుర్తు తెలియని యువకుడు ఎమ్మెల్యేకు లేఖ రాశాడు. ఆ లేఖ ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. వైరల్ లేఖ వివరాల్లోకెళితే.. మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలోని రాజూరా ఎమ్మెల్యే సుభాష్ ధోతేకు (MLA Subhash Dhote) ఇటీవల ఓ లేఖ వచ్చింది. మరాఠీలో రాసిన ఆ లేఖ భూషణ్‌ జాంబవంత్‌ రాథోడ్‌ పేరిట వచ్చింది.

ఆ లేఖ తెరచి చూడగా.. మన ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. గద్‌చందూర్‌ నుంచి రాజురా మధ్య నిత్యం ప్రయాణిస్తుంటా. భవిష్యత్‌లో నాకు ప్రేయసి (Unhappy with not getting a girlfriend ) దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు. తాగుబోతులకు తప్ప ఎలాంటి చెడు అలవాట్లు లేని నాలాంటివారికి ప్రేయసి దొరకడం లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న అమ్మాయిలను ప్రోత్సహించండి’ అంటూ ఆ లేఖలో ఎమ్మెల్యేకు సూచిస్తూ పంపాడు. ఆ లేఖను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఆరా తీశారు.

నా భర్తను వెంటనే ఆఫీసుకు పిలవండి, లేదంటే నా కాపురం కూలిపోయేలా ఉంది, హర్ష్ గోయెంకాకు లేఖ రాసిన ఆర్పీజీ ఎంటర్ ప్రైజెస్ ఉద్యోగి భార్య, ట్విట్టర్లో వైరల్ అవుతున్న గోయెంకా ట్వీట్

భూషణ్‌ జాంబవంత్‌ రాఠోడ్‌ పేరుగల వారిని ఆరా తీయగా అలాంటి పేరుతో ఉన్నవారెవరూ లేరు. వైరల్‌గా మారడానికి ఇలా లేఖ రాశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ లేఖపై సోషల్‌ మీడియా ఫన్నీగా స్పందిస్తోంది. నీదే కాదు బ్రదర్‌ నా పరిస్థితి అంతే అంటూ సింగిల్‌ కింగ్‌లు పేర్కొంటున్నారు. ఫన్నీ మీమ్స్‌, కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి లేఖ రావడం ఇదే మొదటిసారిని ఎమ్మెల్యే పేర్కొన్నాడు. ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే అతడికి కౌన్సిలింగ్‌ ఇస్తామని ఎమ్మెల్యే సుభాష్‌ చెప్పాడు.



సంబంధిత వార్తలు

Egg Attack On BJP MLA Munirathna: వీడియో ఇదిగో, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై కోడి గుడ్డుతో దాడి, నన్ను చంపేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపణలు, ఖండించిన కర్ణాటక కాంగ్రెస్ నేతలు

Congress MLA Aadi Srinivas: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు, కేటీఆర్ అరెస్ట్ తర్వాత విధ్వంసానికి బీఆర్ఎస్ కుట్ర...రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు ప్లాన్ చేశారని కామెంట్

Telangana Assembly Sessions: బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. కౌశిక్ రెడ్డిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆగ్రహం..తీరు మార్చుకోకపోతే సస్పెండ్ చేస్తానని వార్నింగ్

Atul Subhash Suicide Case: అతుల్ సుభాష్ కేసు, దేశ వ్యాప్తంగా న్యాయం కోసం గళమెత్తుతున్న పురుష ప్రపంచం, Xలో ట్రెండింగ్‌లో నిలిచిన #MenToo, #JusticeIsDue హ్యాష్ ట్యాగ్‌లు