Kantara 2: ఫుల్ స్వింగ్‌లో కాంతార 2 పనులు.. భూతకోలలో పాల్గొన్న రిషబ్ శెట్టి
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Hyderabad, April 30: కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన కాంతార (Kantara) సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ (Super Hit) గా నిలిచింది. కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ దాదాపు 400 కోట్ల వరకు వసూల్ చేసింది. దీంతో ఇప్పుడు ప్రేక్షకులంతా కాంతార 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే కాంతారా కు సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు. నిజానికి ఇది ప్రీక్వెల్. ఇప్పటికే డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం కథను సిద్ధం చేసేశారు. తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు రిషబ్ శెట్టి. ఈ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయని తెలుస్తుంది. రీసెంట్ భూతకోల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో హీరో రిషబ్ శెట్టి కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది.