Chiranjeevi: మెగా ప్రిన్సెస్ కు స్వాగతం.. నీ రాక ఆనందంగా, గర్వంగా ఉందంటూ మనవరాలి గురించి చిరంజీవి ట్వీట్

మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్ భార్య ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.

Credits: TollywoodAdda

Hyderabad, June 20: మెగా ఫ్యామిలీలో (Mega Family) సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. చిరంజీవి (Chiranjeevi) మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్ (Ramcharan) భార్య ఉపాసన (Upasana) పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు. తనకు మనవరాలు పుట్టిన ఆనందాన్ని చిరంజీవి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'లిటిల్ మెగా ప్రిన్సెస్'కు స్వాగతం అంటూ చిరు ట్వీట్ చేశారు. నీ రాకతో లక్షలాది మందితో కూడిన మెగా ఫ్యామిలీలో సంతోషాన్ని నింపావని సంతోషాన్ని వ్యక్తం చేశారు. నీ రాక ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని అని అన్నారు.

Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement