Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన

మెగా ఫ్యామిలీ ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్, ఉపాసన అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.

Ramcharan Upasana Blessed With Baby Girl: మెగా ఇంట సంబరాలు.. అమ్మానాన్నలైన రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు.. నేడు తెల్లవారుజామున పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన.. మెగా ఇంట మిన్నంటిన సంబరాలు, యువరాణి వచ్చిందంటూ మెగా ఫ్యామిలీ ప్రకటన
Upasana Ram Charan

Hyderabad, June 20: మెగా ఫ్యామిలీ (Mega Family) ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగా కుటుంబం, మెగాభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అద్భుతమైన క్షణం రానే వచ్చింది. రామ్ చరణ్ (Ramcharan), ఉపాసన (Upasana) అమ్మానాన్నలు అయ్యారు. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో (Appolo Hospital) మంగళవారం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసుపత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. బిడ్డ పుట్టడంతో అటు మెగా, ఇటు కామినేని కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి. రామ్‌చరణ్ తన కూతురిని చూసి మురిసిపోయారని ఆయన సన్నిహితులు చెప్పారు. మెగా ప్రిన్సెస్ పుట్టిందంటూ మెగా ఫ్యామిలీ ఓ ప్రకటన విడుదల చేసింది.

IndiGo: భారత ఏవియేషన్ చరిత్రలో భారీ డీల్, 500 విమానాలను కొనుగోలు చేయాలని ఇండిగో నిర్ణయం, ఏ320 నియో, ఏ321 నియో, ఏ321 ఎక్సఎల్ఆర్ విమానాల కోసం ఆర్డర్

బిడ్డ పుట్టాక మళ్లీ అత్తమామలతోనే..

2012లో రామ్‌చరణ్ ఉపాసనల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ జంట తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందబోతున్నట్టు మెగా, కామినేని కుటుంబాలు గతేడాది నవంబర్ 12న వెల్లడించాయి. కొన్ని రోజుల క్రితమే ఉపాసన సీమంతం ఘనంగా నిర్వహించారు. ఇక పెళ్లయిన నాటి నుంచీ అత్తమామలతోనే ఉంటున్న రామ్‌చరణ్, ఉపాసన తాము గత కొంత కాలంగా విడిగా ఉంటున్నామని ఇటీవల ప్రకటించారు. అయితే, బిడ్డ పుట్టాక మళ్లీ అత్తమామలతోనే ఉంటామని కూడా పేర్కొన్నారు.

ఐఎండీ చల్లని కబురు, రేపటి నుంచి ఎండలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం, గత 10 రోజులు నుంచి వణికిస్తున్న హీట్‌వేవ్

(The above story first appeared on LatestLY on Jun 20, 2023 08:14 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).