Delhi Storm: ఢిల్లీని కుదిపేసిన దుమ్ము తుఫాను.. ఈదురుగాలులకు నేలకూలిన చెట్లు, దెబ్బతిన్న భవనాలు.. ఇద్దరు మృతి.. మరో 23 మందికి గాయాలు.. విమాన రాకపోకలకు అంతరాయం

దేశ రాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను కుదిపేసింది. అనంతరం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

Delhi Storm (Credits: X)

Newdelhi, May 11: దేశరాజధాని ఢిల్లీ – ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని శుక్రవారం దుమ్ము తుఫాను (Delhi Storm) కుదిపేసింది. అనంతరం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో జనజీవనం స్తంభించింది. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి (Trees Fall). చాలా భవనాలు దెబ్బతిన్నాయి (Buildings Damaged). మరోవైపు చెట్లు, గోడ కూలిన ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో 23 మంది గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. దుమ్ము తుఫాను కారణంగా పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Salting Food Increases Risk of Cancer: ఉప్పు ఎక్కువగా తింటున్నారా?? అయితే మీకు ఉదర క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఉంది జాగ్రత్త.. వియెన్నా యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement