చుక్కలను అంటిన బంగారం, వెండి ధరలు దేశీయ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం తగ్గుతున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర మంగళవారం ఒక్కరోజే రూ.1,750 తగ్గి రూ.77,800లకు పడిపోయింది. ఇక కిలో వెండి ధర రూ.2700 పడిపోయి రూ.91,300లకు చేరుకున్నది. సోమవారం అయితే బంగారం పది గ్రాములు ధర రూ.79,550గానూ కిలో వెండి ధర రూ.94 వేలుగానూ ఉంది.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు 2597 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ఔన్సు 30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
కాన్పు తర్వాత మహిళ యోనీలో సూదిని వదిలేసిన డాక్టర్లు, 18 ఏళ్ళ పాటు అది అలా గుచ్చుకుంటే.. విలవిలలాడుతూ
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో..డాలర్ రేటు క్రమంగా పుంజుకుంది. ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందనే అంచనాల మధ్య బంగారం రేటు తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 19.90 డాలర్లు తగ్గి 25,97.80 డాలర్లకు చేరుకుంది. ఔన్స్ సిల్వర్ ధర 30.43 డాలర్ల వద్ద వద్ద ముగిసింది.