Gurukulam Admissions: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు.. జనవరి 6 వరకు దరఖాస్తులు.. ఫిబ్రవరి 11న ప్రవేశ పరీక్ష
ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లో 2024 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వెల్లడించింది.
Hyderabad, Dec 18: ఎస్సీ (SC), ఎస్టీ(ST), బీసీ (BC) గురుకుల పాఠశాలల్లో (Gurukulam Admissions) 2024 విద్యా సంవత్సరంలో ఐదోతరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ (Telangana) సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ వెల్లడించింది. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. విద్యార్థులు జనవరి 6లోగా ఆన్ లైన్ లోనే దరఖాస్తులు సమర్పించాలి. ఫిబ్రవరి11న రాతపరీక్ష నిర్వహిస్తారు. మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. వివరాలకు 1800 425 45678 టోల్ ప్రీ నంబర్‌లో సంప్రదించవచ్చు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)