Congress MLC Teenmar Mallanna (Phoot-X/Video Grab)

Hyd, Feb 4: సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం. రాష్ట్రంలో మొత్తంగా 1.12 కోట్ల కుటుంబాల వివరాలు సర్వే చేశాం. సర్వే ప్రకారం ఎస్సీలు 61,84,319 (17.43 శాతం), బీసీలు (ముస్లిం మైనారిటీ మినహా) 1,64,09,179 (46.25 శాతం), ఎస్టీలు 37,05,929 (10.45 శాతం), ముస్లిం మైనారిటీలు 44,57,012 (12.56 శాతం) మంది ఉన్నారని సీఎం తెలిపారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కులగణన నివేదిక(Caste Census) తప్పులతడక(Mistakes)గా ఉందంటూ బీసీ కులసంఘాలు(BC Caste Groups) సర్వే నివేదికను చించి(Tear) చెత్త బుట్టలో వేసి నిరసన(Protest) వ్యక్తం చేశాయి.ఇక కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన సర్వే నివేదికను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తగలబెట్టమని..ఇదొక తప్పుల తడక అని చెప్పడం కులగణన సర్వే నివేదికను మరింత వివాదస్పదం చేసింది.

వీడియో ఇదిగో, రెడ్లను కుక్కలతో పోల్చుతూ తీన్మార్ మల్లన్న దూషణ,  పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు, వదిలే ప్రసక్తే లేదని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

మంగళవారం శాసన సభలో, శాసన మండలిలో కులగణన సర్వే నివేదికపైన, బీసీ రిజర్వేషన్ల అంశంపైన అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదాలు కొనసాగుతున్నాయి.బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే సభలో పెట్టలేదని సీఎం సహా కాంగ్రెస్ సభ్యులు ఆరోపించగా...తాము వెబ్ సైట్ లో పెట్టామని..ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన నివేదికను సభలో పెట్టలేదని కేటీఆర్ విమర్శించారు.

Teenmar Mallanna burns caste census survey papers 

కులగణన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ బేగంపేటలో బీసీ కుల సంఘాల సమావేశంలో కులగణన నివేదికను చింపివేసిన బీసీ నాయకులు pic.twitter.com/SFPwQZTbPP

ఎంఐఎం పక్ష నేత అక్బరుద్ధిన్ మాట్లాడుతూ ప్రభుత్వం కులగణనపై ప్రకటనకు పరిమితం కాకుండా సభలో నివేదిక పెట్టాలని డిమాండ్ చేశారు. సర్వే వివరాలలో ప్రైవసీ అంశాలున్నాయని..లీగల్ గా సమస్యలు వస్తాయని అందుకే సభలో పెట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మా సర్వేలో బీసీలు, ముస్లీంలు జనాభా అధికంగా ఉన్నట్లు తేలిందన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు సాధ్యపడకపోతే పార్టీ పరంగా 42శాతం టికెట్లు ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఎమ్మెల్సీ తీన్మార్‌మల్లన్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. గెలుపు ఓటములను ప్రజలు నిర్ణయిస్తారని, వ్యక్తుల కాదన్నారు. ‘తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ బీ ఫాం నాకే ఇచ్చారు. అప్పుడుపెద్ద ర్యాలీ చేశాం. మంత్రిగా ఉండి జిల్లాలో ఎమ్మెల్సీ ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా. బీసీ మీటింగ్ పెట్టి మల్లన్న ఇతర కులాలను తిట్టడం ఏంటి. బీసీల కోసం కాంగ్రెస్ గొప్ప నిర్ణయం తీసుకుంది.కాంగ్రెస్ బీ ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న మాపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారు.

మల్లన్న నన్ను తిడితే స్వాగతిస్తా. కానీ ఎవరైనా సరే ఓక కులాన్ని తిట్టడం కరక్ట్ కాదు. ఇక కేసీఆర్,కేటీఆర్,హరీష్‌రావు ఆస్తులు రాయాలంటే ఒక పుస్తకం కావాలి.అందుకే కులగణన సర్వేలో కవిత మినహా కేసీఆర్ ఫ్యామిలీ పాల్గొనలేదు.అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం.కేంద్రం ఓకే అంటే ఓకే..లేదంటే మా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం.ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెలలోనే మరో రోజు సభ పెడుతాం’అని కోమటిరెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ ఉంది. త్వరలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తీన్మార్‌ మల్లన్నపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల మల్లన్న ఓ బహిరంగ సభలో బీసీ కులగణన సహా పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే.