TSPSC Group-IV Update: గ్రూప్-4 అభ్యర్థులకు ముఖ్య గమనిక.. త్వరలో డాక్యుమెంట్ వెరిఫికేషన్.. అన్ని సిద్ధం చేసుకోవాలంటూ టీఎస్‌పీఎస్సీ సూచన

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 అభ్యర్థులకు కీలక సూచన చేసింది. త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.

TSPSC (Credits: X)

Hyderabad, May 18: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-4 (Group-4) అభ్యర్థులకు కీలక సూచన చేసింది. త్వరలో సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుందని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అభ్యర్థులందరూ వెరిఫికేషన్‌ కు కావల్సిన సర్టిఫికేట్లను సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్సీ త్వరలో అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ కు పిలుస్తామని ప్రెస్ నోట్‌ లో తెలిపింది. 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను పిలుస్తామని పేర్కొంది. ఇక దివ్యాంగుల కోటాలో 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఆహ్వానిస్తామని స్పష్టం చేసింది. కాగా గతేడాది జులై 1న టీఎస్‌పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష నిర్వహించగా.. ఫిబ్రవరి 9న జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేసింది.

తెలంగాణ రాష్ట్రం సంక్షిప్త నామం మార్పు.. ఇప్పటివరకూ ఉన్న టీఎస్ ఇకపై టీజీ.. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, ఏజెన్సీలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు చేయాల్సిందే.. సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులు.. ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ మార్పు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement