Special Trains: తెలుగు రాష్ట్రాల మధ్య 10 ప్రత్యేక రైళ్లు ఈ నెలాఖరు వరకు పొడిగింపు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నిర్ణయం

ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.

Representational (Credits: Facebook)

Hyderabad, Dec 1: తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య ప్రయాణించే రైల్వే (Railway) ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ఇప్పటికే సేవలందిస్తున్న 10 ప్రత్యేక రైళ్లను (Special Trains) ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్-తిరుపతి (07482) రైలు ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07481) 3వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం నడుస్తుంది. పొడగింపు రైళ్ల జాబితాలో.. హైదరాబాద్-నర్సాపూర్ , కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-అకోలా, పూర్ణ-తిరుపతి జత రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

LPG Cylinder Price Hike: గ్యాస్‌ మంట.. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌ ధరపై రూ.21 పెంపు.. హైదరాబాద్‌లో రూ.2024.5కు చేరిన గ్యాస్ బండ ధర

Credits: Google (Representational Image)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)