TSRTC Package Tours: తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, వచ్చే నెల 10 నుంచి TTD దర్శన బుకింగ్ టికెట్లు అందుబాటులోకి, టిక్కెట్‌తో పాటు అప్ అండ్ డౌన్ టిక్కెట్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమల, శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక వైబ్ సైట్ https://www.tsrtconline.in/oprs-web/services/packagetours.doలో పొందుపరిచింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తిరుమల, శ్రీశైలం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను అధికారిక వైబ్ సైట్ https://www.tsrtconline.in/oprs-web/services/packagetours.doలో పొందుపరిచింది. టీఎస్ఆర్టీసీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం తిరుమల వెళ్లాలనుకునే వారికి సరసమైన ధరలలో ప్యాకేజీ అందుబాటులో ఉంది.
TSRTC టిటిడి ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్‌తో పాటు తిరుపతి వరకు బస్సు టిక్కెట్‌తో పాటు తిరుపతి-తిరుమల అప్ అండ్ డౌన్ టిక్కెట్ (APSRTC బస్సులలో) కూడా ప్రవేశపెట్టింది. రిటర్న్ టికెట్ ఐచ్ఛికం. ప్రయాణ టిక్కెట్లను కనీసం ఏడు రోజుల ముందుగా బుక్ చేసుకోవాలని కోరింది. TTD దర్శన బుకింగ్‌లు 04.10.2023 నుండి అందుబాటులో ఉంటాయని టీఎస్ఆర్టీసీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక సైట్ సంప్రదించాలని, భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది.
Here's TSRTC Update