Baghpat Watchtower Collapse: వీడియోలు ఇవిగో, ఆదినాథుడి ఆలయంలో లడ్డూ మహోత్సవంలో కుప్పకూలిన వేదిక, 20 మందికి పైగా గాయాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బాగ్‌పత్ (Baghpat)లో ఆదినాథుడి ఆలయంలో లడ్డూ వేడుక నిర్వహిస్తుండగా చెక్కతో నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Platform Collapses). ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరౌత్‌లోని జైన్ కమ్మూనిటీ ఇవాళ ‘లడ్డూ మహోత్సవ్’ (Laddoo Mahotsav)ను నిర్వహించింది.
ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బాగ్‌పత్ (Baghpat)లో ఆదినాథుడి ఆలయంలో లడ్డూ వేడుక నిర్వహిస్తుండగా చెక్కతో నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Platform Collapses). ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరౌత్‌లోని జైన్ కమ్మూనిటీ ఇవాళ ‘లడ్డూ మహోత్సవ్’ (Laddoo Mahotsav)ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదినాథుడి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం నిర్వాహకులు చెక్కతో వేదికను నిర్మించారు. అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బరువు ఎక్కువై వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ప్రమాదం గురించి అధికారులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.
Baghpat Watchtower Collapse:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)