Man Stabs Bus Conductor: వీడియో ఇదిగో, ఫుట్‌బోర్డు నుంచి పైకి రమ్మన్నందుకు కండక్టర్ మీద కత్తితో దాడి
బెంగుళూరు నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు.
బెంగుళూరు నగరంలోని ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తున్నాడు. ఇది గమనించిన బస్సు కండక్టర్ అతడిని పైకి రమ్మన్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు కండక్టర్‌పై కత్తితో దాడి చేశాడు. ఇంతటితో ఆగకుండా తోటి ప్రయాణికులను బస్సు దిగాలని బెదిరించాడు. బస్సు అద్దాలను సుత్తితో ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో కండక్టర్ యోగేష్(45)కు గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కత్తిదాడికి పాల్పడ్డ యువకుడిని జార్ఖండ్‌కు చెందిన హరీశ్‌సిన్హా(28)గా గుర్తించారు. ఇతడు కాల్‌సెంటర్‌లో పనిచేస్తూ గత నెలలో ఉద్యోగం కోల్పోయాడు. వైట్‌ఫీల్డ్ ఏరియా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)